Jump to content

గరిమెళ్ళ సత్యనారాయణ

వికీవ్యాఖ్య నుండి

స్వాతంత్ర్యోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణ (1893 - 1952) ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు.

గరిమెళ్ళ సత్యనారాయణ యొక్క ముఖ్య వ్యాఖ్యలు

[మార్చు]
  • మా కొద్దీ తెల్ల దొరతనం
  • "బంధుజనులారా! దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుష్యులోయ్!"
  • వయోజన విద్య గురించి కీర్తన:

చదువులు చదువుటకన్న - బహు
శాస్త్రజ్ఞానము కెదిత్రోవన్న? ......చ॥
ఆచదువు మనకురాకున్న - మన
సంసారములను సుఖములు సున్న..... చ॥

చింతలను తొలగించు - సిరిని తన
చెంతకును పిలిపించు - యెన్నో
మంతనముల నెఱిగించు - ధీ
మంతులుగా జనముల నొనరించు ..... చ॥

వినయమునకు అది నెలవు - బహు
విద్దియలందున గలవు - వృ
త్తులకును గూర్చును చెలువు - ని
స్తులమని దానిని పిలువు.....చ॥

ఇహసౌఖ్యము కది వెరవు - మోక్షపు
మహలున కదియే తెరువు
అదియుంటే కలుగదు కరువు
లేకుంటే బ్రతుకే బరువు ..... .......చ॥

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.