గుండె
Appearance
గుండె (Heart) మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం. ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది ఛాతీ మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది.
జాతీయాలు
[మార్చు]- గుండె కరగు - జాలిపడు
- గుండె చెరువగు - మిక్కిలి వ్యధచెందు
- గుండె రాయి చేసుకొను - ధైర్యము వహించు
- గుండెలవిసిపోవు - తీవ్రమైన దుంఖం లేదా భయం కలగడం
- గుండెలు తీసిన బంటు - నిర్దయుడు
- గుండెలు బాదుకొను - నమ్మలేని విషయం వల్ల కలిగే బాధ
- గుండెల్లో గుడికట్టు - కృతజ్ఞుడైయుండు
- గుండెల్లో గుబులు - లోలోన భయం
- గుండెల్లో రాయి పడడం - ఓటమి సూచకంగా ఎంతో భయం కలగటం