గోపాల గోపాల

వికీవ్యాఖ్య నుండి

గోపాల గోపాల వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించగా జనవరి 10, 2015న విడుదలైన తెలుగు చిత్రం. 2012లో విడుదలై విజయం సాధించిన హిందీ చలనచిత్రం ఓ మై గాడ్‌ను అనుసరించి దగ్గుబాటి సురేష్ బాబు, శరత్ మరార్‌లు కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో నిర్మించారు.

కృష్ణుడు (పవన్ కళ్యాణ్)[మార్చు]

  • నేను టైమ్ కు రావటం కాదు మిత్రమా...నేను వచ్చాకే టైమ్ వస్తుంది. [1]
  • దారి చూపించడం వరకే నా పని...గమ్యాన్ని చేరుకోవడం మీ పని.
  • బరువు చూసేవాడికి కాదు మిత్రమా.. మోసేవాడికి తెలుస్తుంది.
  • సమర్థులు ఇంట్లో ఉండిపోతే అసమర్థులు రాజ్యమేలుతారు.

గోపాలరావు (వెంకటేష్)[మార్చు]

  • మనిషి దేవుడ్ని రాయిగా మార్చాడు, నిజంగా దేవుడే కనుక ఉంటే మనిషిని మనిషిగా మార్చమనండి చాలు.

డైలాగులు[మార్చు]

‘‘ఆ కృష్ణుడు మాత్రం ఏం చేశాడు. తనను దేవుడని నమ్మిన బావమరిదితో బంధువులందరినీ నరికించాడు’’ అంటూ గోపాలరావు(వెంకటేష్) ఆవేశంగా నిందిస్తూంటే నిబ్బరంగా కృష్ణుడు(పవన్ కళ్యాణ్) ‘‘ధర్మం. అదే ధర్మం. ఒక ఆడదాన్ని నిండు సభలో బట్టలూడదీస్తూంటే ఎదిరించగలిగీ, ఎదురుతిరగని ప్రతివాడూ చావాల్సిందే.. భీష్ముడితో సహా. అదే ధర్మం. ఒక్క అశ్వత్థామ మాత్రం ఇది తప్పు అని ఎదిరించి, సభలో ఉండలేక వెళ్ళిపోయినందుకు బతికిపోయాడు. ఇదీ ధర్మం.[2]

మూలాలు[మార్చు]