గౌతమ బుద్ధుడు
స్వరూపం
గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు బౌద్ధమత స్థాపకుడు. బుద్ధుని జనన మరణాల కాలంపై చరిత్రకారులలో ఏకాభిప్రాయం లేదు. క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు.
గౌతమ బుద్ధుని వ్యాఖ్యలు
[మార్చు]- ముందు తను వెళ్ళాల్సిన దారిని తనకుతాను నిర్దేశించుకున్నవాడే ఇతరులకు దారి చూపించగలడు.
- సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము.
- ఒక వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా, ఎప్పటికి అతన్ని వీడని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది.
- ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది, ఆశ నుండి విముక్తి పొందితే దుఖం అంతమవుతుంది.
- నా మతం అందరి మంచి కోసము, ఎందుకంటే అందరి మంచితోను అందరి ఆనందము ఉంది. ఇది ఆదిలో మంచిది, ఇది మధ్యలో మంచిది, ఇది అంతములో మంచిది.
- నీ భాధకు కారణం ఏదైనా కావచ్చు. కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు.
- వేలాది వ్యర్ధమైన మాటలకన్న విన్నంతనే శాంతిని ,కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు.
- అహంకారం, మమకారం అంతరించినపుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది.
- త్యాగం,దానం ...ఈ రెండు ప్రతి మనసును ఆకర్షిస్తాయి.
- ఒక దీపం నుంచి వేల దీపాలను వెలిగించవచ్చు. సంతోషం కూడా అలాంటిదే.
- అన్ని జీవుల యెడల దయ చూపించినవాడే ఎక్కువ గౌరవనీయుడు.
- ఇతరుల తప్పుల్ని గమనించడం తేలిక,తన తప్పుల్ని గమనించడం కష్టం.
- ఎన్నడు ఈ ప్రపంచంలో ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేము. ద్వేషించకుంటే మాత్రమే ద్వేషాన్ని నివారించగలం. ఇది ఎప్పటికి వర్తించే సూత్రం.
- వెయ్యి కోరికలను తీర్చుకోవడం కంటే ఓ కోరికను జయించడంలోనే ఆనందం.
- మనం చేసే మంచి పనులైనా, చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే వుంటాయి.
- వయోవ్రుద్ధులను ఆరాధించువారు ఆయురారోగ్యములతో వర్ధిల్లును.
- పాపకృత్యములు చేయకుండుట, సుభకర్మలు ఆచరించుట, చిత్తమును పరిసుద్ధము చేసుకొనుట నిజమైన వ్రతం.
- ఓర్పుకు మించిన గొప్ప ప్రార్ధన మరొకటి లేదు.
- మనసు అదుపులో ఉంటే ఆనందమే.
- ఇతరుల గురించి, నీ గురించి నీకు మంచి అభిప్రాయం ఉంటేనీవు మంచిని,నిజమైన దాన్ని గూర్చి మాత్రమే మాట్లాడు. ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చెయ్యి అప్పుడు నీకు మోక్షమార్గం సులభంగా అలవడుతుంది.
- మనుష్యుడు తన నిశ్చల మనస్సు తోటి పూర్తి నమ్మకం తోటి ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యం సాధించలేడు.
- ఒక మనిషికి మోక్షం లభిస్తే ఈ జనన మరణ సంకెళ్ళ నుండి విముక్తి పొందినట్లే కనుక నిర్వాణం సాధించడానికి ప్రయత్నించాలి.
- సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని దాచలేము..
[[1]]