గ్రంథాలయము
Appearance
గ్రంథాలయములను గ్రంథ భాండాగారము అనికూడా అంటారు.
కొన్ని వ్యాఖ్యలు
[మార్చు]సీ. అరువది నాల్గువిద్యలు నొక్కచో నేర్వఁ, దగు నిలయంబు గ్రంథాలయంబు
దరి లేని దుఃఖసాగరముల నీదంగఁ, ధరణితుల్యంబు గ్రంథాలయంబు బుద్ధిమదగ్రణుల్ పూర్వులొసంగిన, ధననిధానంబు గ్రంథాలయంబు అజ్ఞానతిమిర సంహారంబుగావించు, నర్క తేజంబు గ్రంథాలయంబు
గీ. యశమె కాయంబుగాఁగల ప్రాజ్ఞ సుకవి | బృందముల రూపములఁ బ్రదర్శించిజన
గరము సమ్ముదితాత్ములు గానెనర్చు | నట్టి సన్మందిరంబు గ్రంథాలయంబు.
- గ్రంధాలయాలు ఊహకు ఆజ్యం పోసే శక్తిని నిల్వ చేస్తాయి. అవి ప్రపంచానికి కిటికీలను తెరుస్తాయి, అన్వేషించడానికి, సాధించడానికి మన జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి.
- - సిడ్నీ షెల్డన్
మ. అతివాచావిభవంబుతో సభలయం దాటోపమేపార ధీ
యుతులై యెంత యుపన్యసించినను లేదొక్కింతయు లాభమూ
ర్జిత కార్యాచరణ ప్రవీణతయె వాసింగూర్చు జ్ఞానాప్తికై
ప్రతియూరన్నెలకొల్పు డాంధ్రులు సమగ్ర గ్రంథ భాండారముల్....పోచిరాజు సీతారామయ్య