చర్చిల్
విన్‌స్టన్ చర్చిల్ బ్రిటన్‌కు చెందిన రాజకీయవేత్త. ఇతడు నవంబర్ 30, 1874న జన్మించాడు. 1940 నుండి 1945 వరకు మరియు 1951 నుండి 1955 వరకు యునైటెడ్ కింగ్‌డమ్‌కు ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఏప్రిల్ 7, 1955న మరణించాడు. 1952లో సాహిత్యంలో నోబెల్ పురష్కారం పొందినాడు.
చర్చిల్ యొక్క ముఖ్య ప్రవచనాలు:
- ఆల్కహాల్ నా నుంచి తీసుకున్నదాని కంటే నేను దాన్నుంచి పొందిందే ఎక్కువ.
- నీ ప్రవృత్తి ఇతరులతో నిన్ను పోల్చి చూపిస్తుంది.
- ప్రజాస్వామ్యం పనికిమాలిందే కావచ్చు గాక... కానీ అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదు.
- నీకు శత్రువులు ఉన్నారా? మంచిది. నీ జీవితంలొ ఏదైనా సాధించేందుకు నీవు ధైర్యంగా నిలబడినందుకు.
- నిరాశావాది తనకు లబించిన ప్రతి అవకాశంలొ సమస్యల గురించి అలొచిస్తుంటాడు. ఆశావాది తనకు కల్గిన సమస్యలలో ఏదైనా అవకాశం ఉందేమోనని వెతుకుటుంటాడు.