Jump to content

చలం

వికీవ్యాఖ్య నుండి

చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. చలం 1894లో జన్మించి 1979లో మరణించాడు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావిత పరచిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. అతని రచనల నుండి కొన్ని వ్యాఖ్యలు...

  • స్త్రీ ఒక మాట వల్ల,చూపు వల్లా పురుషునికి సందిచ్చిందా....ఇక అతని అధికారానికి, కోరికలకి, విన్నపాలకి అంతం ఉండదు. అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే ఉండాలి......నిప్పు వలె ఉండాలి, ...
  • "కృష్ణ శాస్త్రి తన బాధను అందరిలో పలికిస్తే శ్రీ శ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు. కృష్ణ శాస్త్రి బాధ ప్రంపంచానికే బాధ ప్రపంచం బాధ, శ్రీ శ్రీ బాధ".
- ఇది చలం మహాప్రస్థానికి ఇచ్చిన యోగ్యతా పత్రం సారాంశం.
  • "స్త్రీ జీతంలేని సంఘ బానిస"
  • బుద్ధిని ఆడించడానికి మనసు చేసే గారడీ.......ప్రేమ!
  • తనకీ, ప్రపంచానికి సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్,బహిర్ యుద్ధారావమే కవిత్వం.
  • గొప్ప కవిత్వం యొక్క ప్రధాన లక్షణమేమిటంటే ఎవరి తాహత్తును బట్టి వారికి ఎంతో కొంత అనుభూతి కలిగించడం.
  • సాధించవలసిన దానిని ఈ ప్రపంచంలో ఏదైనా సాధించారంటే తిరగబడ్డ వాళ్లే.
  • సృష్టి ప్రారబ్ధం వల్ల పురుషుడి మీద ఆకర్షణ .. మనసు ధిక్కారం వల్ల అతని మీద అసహ్యం.. చదువువల్ల రొమాన్స్ లో విశ్వాసం..ఆ చదువు చెప్పే నీతి వల్ల శరీర సంపర్కం నీచం. అలా ఆమెలో జరిగే విరోధాల వల్ల చాలా వికృతంగా తయ్యారయింది నేటి స్త్రీ.
  • " పురుషుడి సౌఖ్యం కన్నా..తమ సౌఖ్యం కన్నా..మొహం కన్నా..కలయిక కనా..తామే అధికులమని గర్వం రాయి కట్టిస్తుంది స్త్రీ ని. తమని ఇచ్చుకునే గుణం వాళ్ళనుంచి సంతృప్తి దొరకదు.
  • "ఏదన్నా సరే ప్రపంచంలో అర్థం కావాలంటే, సానుభూతితో దానిలో ఐక్యమై ఆ దృష్టి తో యోచించాలి. ఎక్కిరింపు..ఏమీలేదని కొట్టేయటం చాలా సులభం.ఇంతకీ ...లేని సౌదర్యాన్ని నేను చుస్తున్ననా ?? ఉన్న సౌందర్యానికి *మీరు అందులయినారా ?ఎవరు తేల్చ గలరు ?? ఉంటే ఆ ఈశ్వరుడు తప్ప.
  • అరణ్యానికి పోయి బ్రతుకు పాడుచేసుకున్న రాముడిని దేవుడిని చేసి జీవితం లోని సారాన్ని..సుఖాన్ని ..సంతోషాన్ని..పీల్చి పిప్పి చేసారు.

ధనము ..కీర్తి ..సుఖాలు వీటికోసం బ్రతికేవాడు గొప్ప.. ఏ ఆశయానికో..అన్వేషణకో ..కళకో జీవితాన్ని అర్పించేవాడు...తుచ్చుడు..పిచ్చివాడు.

  • రోజు రొటీన్ లో శవాల మల్లె బ్రతకటం కన్నా..ఏదో గొప్ప ఆనందానికై ప్రయత్నించావా ?ధనము కీర్తి రెండే ముఖ్య సూత్రాలు. getting on … climbing on …. అదే జీవిత పరమావధి. ఆ దేవత ముందు బలికి పనికి రాని ఆదర్శం లేదు.
  • ఈ లోకపు అంధకారం ఎలాంటిదంటే.. సముద్రంలో ఎన్ని కాగడాలు వెలిగించి వేసినా అవి ఎలా ఆరిపోతాయో..అలాంటి అంధకారం అలముకొంది లోకంలోఈ ప్రపంచంతో సమన్వయం నాకు కుదరలేదు.

ఇప్పాటికీ కుదరలేదు..ఎప్పటికీ కుదరదేమో మరి. ఈశ్వరుడు ప్రత్యక్షమై సత్య దర్శనం అయితే అప్పుడిదంతా అర్ధమవుతుందంటారు. కాని నాకు అట్టాటిది ఏ ఆశలేదు. ఈ తల నొప్పులతో , ఈ బాధలతో ఈ దరిద్రం తో కూడా జీవితం అంటే నాకు చాల మధురంగా ఉంది..జీవితం లేకుండా "శూన్యం" తలచుకొంటేనే నాకు భయం కలుగుతోంది..నాకు జన్మ రాహిత్యం వొద్దు." ..ఏదో ఉరికే రాయాలి, అని అనుకొని రాసింది ఒక్క పుస్తకము లేదు, ఒక్క కథా లేదు. అవి నన్ను చీల్చుకొని నా రక్తం లోంచి వొచ్చిన సత్యాలు. జీవితం స్వప్న మైతే , సుందరమైన స్వప్నాన్నే కందాం. ఈ దరిద్రం లోంచి ఈ భయం లోంచి మేలుకుందాం.

  • అవును... జన్మ రాహిత్యం ఎప్పుడవుతుంది..?? పరమాత్మలో ఐక్యం అయినపుడు.. ఆ ఐక్యం కావడమే నిరంతర అవ్యయానందం ,, ఆ లోకం లో కూడా ఆనందం అంటే.. - ఐక్యం- పువ్వుల వాసనలో.. రంగుల కాంతి తో ఐక్యం కావటం ఆనందం అంటే. వీటన్నింటికీ మూలమైన పరమాత్మ తో ఇక్యం కావటం ముక్తి .
  • " అసలు దేవుడున్నడనటమే మూర్ఖం "ఎందుకు ?" ఉన్నాడని ఎట్లా తెలుసు ? "లేడని ఎట్లా తెలుసు?లేనిదాన్ని తెలుసుకోవడమేట్లా ?ఉన్నదాన్ని తెలుసుకున్నవా ?దేన్నీ ?నిన్ను ..!తేలికేం.తెలుసుకుంటే ఇంక దేవుడి ప్రశ్నే లేదు.
  • ఒక్కటే సాధనం.. సాహసం.
  • " జీవితం లో విశ్వాసం. మూడత్వం మీద ...కర్మ మీద..శాసనం మీద తిరుగుబాటు.. భవిష్యత్తు మీద నిర్భయం.. ఆత్మలో దైర్యం...పర్యవసానాల మీద నిర్లక్షం "
  • "ఈ ప్రపంచంతో సమన్వయం నాకు కుదరలేదు. ఇప్పటికి కుదరలేదు..ఎప్పటికీ కుదరదేమో మరి. ఈశ్వరుడు ప్రత్యక్షమై సత్య దర్శనం అయితే అప్పుడిదంతా అర్ధమవుతుందంటారు. కాని నాకు అట్టాటిది ఏ ఆశలేదు.

స్త్రీలను గౌరవించమని ప్రతివాడు గోలపెడతాడు.. అగౌరవం అంటే కోరటం అని అర్థం.గౌరవం పొందటం అతి సులభం..ఓ నలబై ఏళ్ళు గడిచి మీ సౌదర్యం మాసిపోగానే అత్యంత గౌరవం పొందుతారు. ప్రతివాడు గౌరవిస్తాడు..ఒక్కడూ కోరడు.

  • ఈ నాడు ఈ దేశం లో ఎలాగైనా ధనం సంపాదించే మార్గమే ధర్మ మార్గమైంది.
  • డబ్బు పేరు సంపాదించిన స్త్రీలు తమ సంసారమెట్ల ఉన్నాసరే సంఘంలో యోగ్యులైనారు.
  • తెల్లారి లేస్తే ఉరుకులు, పరుగులు, ఉద్యోగాలు డబ్బులు , ఇవ్వన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనో వ్యవధి, పువ్వులనుంచి, ఆవులనించి, అతితులనించి, ఇతలురాల్ ఆకలి తీర్చడం నుంచి వచ్చే సంతోషం *ఉత్సాహం, శాంతి ఎప్పుడు కలుగుతుందో ఈ మానవులకి.
  • "సౌఖ్య మివ్వడానికి ధనము ఆస్తి ముఖ్యమనుకున్నంత కాలం ఇంకా ఏ విలువకీ స్ట్లముండదు మనుషుల మనస్సులో , తనను సృష్టించిన మన్ను తోటి, తన కళ్ళు తెరిచిన కాంతి తోనూ సంబంధానికి దూరమవుతున్నాడు మనిషి."
  • "మనసు మారకుండా ఆత్మ అభివృద్ధి చెందకుండా ప్రపంచం అంటే అర్థం కాకుండానే ఏవో కొన్ని కర్మల వల్లా.. పూజల వల్లా యోగాల వల్ల దేవుడి దయ సంపాదించ వచ్చుననే నమ్మకం ఈ మనుషులకి.. ప్రపంచంలో ఈ గొప్ప విషయము అర్థం కాని ముర్ఖుడికి ఈశ్వర జ్ఞానం కల్గుతుందట.. ఈ దేశం చాల ఉన్నతమైన దని ఏ లోపాలు లేవని , ఈ ఆచారాలన్నీ చాల వివేకంతో స్థాపించినవనీ, అంతరార్థలున్నాయని కీర్తిస్తే .. మయజోల పాడి జో కొడితే చాల సంతోషం ఈ ప్రజలకి. ఇంకా ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతకటానికి మార్గాలున్నయనీ చెపితే విరోధం సహజమే."

జీవితం స్వప్న మైతే , సుందరమైన స్వప్నాన్నే కందాం. ఈ దరిద్రం లోంచి ఈ భయం లోంచి మేలుకుందాం.

  • సంస్కారమంటే ...ఈనాడు డబ్బు సంస్కారం తప్ప ఇంకోటి లేదు , తనకో ఆత్మ ఉందని మరిచి పోయినాడు మానవుడు. struggle for existance. ప్రకృతిలో- చెట్లలో- కీటకాలలో ఎట్లా ఉంది అంటారో అదే మనుషుల్లో ఈనాడు. వాటికి శాంతి ఉంది అది లేదు మానవుడికి..
  • మతమంటే మనసుకి కలిగే గొప్ప సందేహాలు తీర్చాలి , మన జీవనానికి నమ్మకానికి సమన్వయము కుదిరించాలి.లోకంలో కొత్త సమస్యలు బయలు దేరితే వాటిని అర్థం చెయ్యాలి. నుతనోస్థం ఇవ్వాలి జీవించడానికి. అంతే కాని ఏదో నేను చెపుతున్నాను , నమ్ము. నమ్మితే మోక్షం ,, నమ్మక పోతే నరకం.. నా పాణి పరలోకం ఈ లోకం తో పని లేదు అనే మతం ఎందుకు పనికి రాని మతం..

ఇన్ని ఆచారాలతో ఈశ్వర నామాలతో ప్రతిమూలా మరుగుతో ఉండే ఈ దేశం లో ఈ పూజలు , మల్లు ముక్కులు ముసుకోదాలు , వేదాంతాలు మాట్లాడే వాళ్ళు. రుద్రస్కల వాలు.. విభూతుల వాళ్ళు..వీళ్ళని ప్రశ్నిస్తే ,, ఏదో శాస్త్రం .. అవతారం..కరం అని గొణగడం తప్పిస్తే ఈ సందేహాలు తీర్చరేం ..?? ఎందుకు ఈ ఆద్యాత్మికం ,, ఈ భజనలు భాష్యాలు భగవత్గీతలు అంత గోపా పుస్తకాలేమో వేళ్ళకి ఎవరికీ తెలిసినట్టు కనపడదు. మతానికి జీవితానికి ఈ సంబందం లేదు . దెయ్యాలు ఆత్మలు పరలోకం ఈశ్వరుడు కరం పాపం. పుణ్యం. ఇట్లాంటి విషయమై ఒక్కరికి నిష్టితాభిప్రాయం లేదు.

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=చలం&oldid=12284" నుండి వెలికితీశారు