చానమాంబ

వికీవ్యాఖ్య నుండి

ప్రోలమ, చానమాంబ తొలితరం ఆంధ్ర కవయత్రులలో ప్రధములు. వారు 13వ శతాబ్దము వారు. చానమాంబ రణ తిక్కనగా ఖ్యాతి గాంచిన ఖడ్గ తిక్కనార్యుని భార్య. ఇంకా కవిబ్రహ్మ తిక్కనార్యునికి వదిన గారు..[1]

వ్యాఖ్యలు[మార్చు]

పరీభూతుడయి శత్రువులకు వెన్నిచ్చి పారిపోయి వచ్చిన పతిని చూసి వీరపత్ని అయిన చానమాంబ -

  పగరకు వెన్నిచ్చినచో, నగరే నిను మగతనంపునాయకు లెందున్?
  ముగు రాడు వారమైతిమి; వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్?

చానమాంబ గురించి[మార్చు]

  ఆమె నలువరాణికి తెలుగు చానలు ఉపాయముగా పచరించిన తొలి పూజా పద్మము.
  ఆమె భారతీసతి మంజులపద రాజీవములకడ మొకరిలిన మొదటి పూజారిణి.
  ఆమె వాగ్దేవీ సంసద్భవమున అంధ్ర కవయత్రీ ప్రతినిధ్యము నంగీకరించిన ప్రధామాస్థాని.
  ఆమె సుందరాంధ్ర మహిళావాఙ్మయాంబరమున నుదయించిన తొలితార" 

లక్ష్మీకాంతమ్మ, ఊటుకూరి (1958). "చానమ, ప్రోలమ". ఆంధ్ర కవయిత్రులు. రాజమహేంద్రవరం: బత్తుల కామాక్షమ్మ. pp.1–3.

సూచనలు[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
 1. లక్ష్మీకాంతమ్మ, ఊటుకూరి (1958). "చానమ, ప్రోలమ". ఆంధ్ర కవయిత్రులు. రాజమహేంద్రవరం: బత్తుల కామాక్షమ్మ. pp. 1–3.
"https://te.wikiquote.org/w/index.php?title=చానమాంబ&oldid=18915" నుండి వెలికితీశారు