జోర్జ్ లూయీ బోర్హెస్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
అన్ని వస్తువులు ఒక కారణం కోసం ఇవ్వబడ్డాయి, కళాకారుడు దీన్ని మరింత గాఢంగా దీన్ని అనుభవించాలి. మనకు జరిగే అన్ని విషయాలు, అవమానాలు, దురదృష్టాలు, ఇబ్బందులతో సహా మన కళను మలుచుకోవడానికి పనికివచ్చే ముడిపదార్థమైన మట్టి లాంటిదే.

జోర్జ్ లూయీ బోర్హెస్ (1899-1986) అర్జెంటీనాకు చెందిన కవి, కథకుడు, ఆలోచనాపరుడు, విమర్శకుడు. మాజికల్ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకి ఆద్యుడు.

వ్యాఖ్యలు[మార్చు]

  • అందరూ తాము రాసిన పుస్తకాల గురించి గొప్పచెప్పుకుంటారు, కాని నేను చదివిన పుస్తకాల గురించి గొప్పచెప్పుకుంటాను. నేను మంచి రచయితను అవునో కాదో నాకు తెలియదు గాని, నేను చాలా మంచి పాఠకుణ్ణి. సున్నితపాఠకుణ్ణి. చదివిన పుస్తకాలపట్ల సదా కృతజ్ఞుణ్ణి.
  • ఒక పుస్తకం ఈ విస్తృత విశ్వంలో తన పాఠకుణ్ణి కలుసుకునేదాకా ఎన్నిటిమధ్యనో మరుగునపడిఉండిపోతుంది. ఆ పాఠకుడనే పెద్దమనిషి ఆ పుస్తకంలో తనకోసం ఎదురుచూస్తున్న సంకేతాల్ని తనకోసం బహిర్గతం చేసుకోగానే మనం ‘సౌందర్యం ‘ అంటామే అట్లాంటిదేదో సంభవిస్తుంది. ఆ సమయంలో అతడిలో సంభవించే ఆ భావోద్వేగాన్ని ఏ మనస్తత్వశాస్త్రం, ఏ సాహిత్యవిమర్శ కూడా మనకి అర్థమయ్యేలా వివరించలేవు.