థామస్ మాల్థస్
Appearance
రాబర్ట్ థామస్ మాల్థస్ బ్రిటీష్ ఆర్థికవేత్త. జనాభా సమస్యను మొట్టమొదట సూత్రీకరించిన ఆర్థికవేత్తగా ప్రసిద్ధిచెందినాడు. ఇతడు 1776 ఫిబ్రవరి 13 న జన్మించాడు. 1834 డిసెంబర్ 23న మరణించాడు.
మాల్థస్ యొక్క ముఖ్యమైన వ్యాఖ్యలు:
- ప్రకృతి భోజనశాల వంటిది ఇందులో ఆహుతులకు మాత్రమే చోటు ఉంటుంది అనాహుతులై వచ్చేవారు ఆకలితో అలమటించి చావకతప్పదు.
- (జనాభా పెరుగుదల వల్ల ఆహారధాన్యాల ఉత్పత్తులు సరిపడక ఆకలితో చావవలసి వస్తుందని తన జనాభా సిద్ధాంతంలో ఈ వ్యాఖ్యచేశాడు.)
- ఆహార ధాన్యాలు అంకశ్రేణిలో పెరిగితే, జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంది.