దీపావళి
స్వరూపం
దీపావళి ఒక హిందూ పండుగ.దీపావళి అనేది ధర్మం మీద అధర్మం విజయం, జ్ఞానం మీద అజ్ఞానం జయము, ప్రకాశం మీద చీకటి ఓటమి అనే సంకేతాలు నింపిన పండుగ. ఇది కేవలం పూజలు, బాణసంచా కోసం మాత్రమే కాదు.మనసుల మధ్య వెలుగు నింపేందుకు జరుపుకోవాలి.
చరిత్ర
[మార్చు]- శ్రీరాముడు, సీతా మాత మరియు లక్ష్మణులు 14 సంవత్సరాల వనవాసం తర్వాత, రావణుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి స్వాగతించారు.రామాయణం
- నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించాడు.నరకాసురుని సంహారం తరువాత ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు.దీనినే "నరక చతుర్దశి" అని పేరు. దీపావళికి ముందురోజు ఇది జరుపుకుంటారు.మహాభారతం
వ్యాఖ్యలు
[మార్చు]- దీపావళి అనేది వెలుగుల విజయోత్సవం – చీకటి మీద ప్రకాశం గెలిచిన సంబరం.
- ప్రతి ఇంటిలో వెలుగు, ప్రతి మనసులో సంతోషం నింపే పండుగ దీపావళి.
- నవ ఆశలకి నూతన వెలుగులు నిచ్చే సందడి దీపావళి.
సామెతలు
[మార్చు]- ఇచ్చేటప్పుడు కాముని పండుగ, పుచ్చుకొనేటప్పుడు దీపావళి పండుగ.
