Jump to content

ధైర్యం

వికీవ్యాఖ్య నుండి

ధైర్యం అనేది భయం, బాధ, ప్రమాదం వంటివాటిని ఎదిరించే సామర్థ్యం.

ధైర్యం గురించిన వ్యాఖ్యలు

[మార్చు]
  • ఎప్పుడైతే నువ్వు వేగంగా పోరాడితే జీవించి లేకుంటే మరణిస్తావో దాన్ని మృత్యురంగం అంటారు. వారిని(నీ సైనికులను) పారిపోవడానికి దారిలేని, ఆ ప్రయత్నం చేస్తే ముందుగానే మరణించే ప్రదేశంలో నిలబెట్టు. అక్కడ మరణించబోతారని తెలిస్తే, వారు చేయలేనిదేముంటుంది? యోధులు వారి పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. యోధులు గొప్ప ప్రమాదంలో వున్నప్పుడు వారికి భయం ఉండదు. వారు ఎక్కడికీ పోయేందుకు దారి లేదంటే వారు దృఢంగా తయారవుతారు. వారు రంగంలోకి పూర్తిగా దిగినప్పుడు, పోరాటానికి నిబద్ధులై ఉంటారు. వారికి మరే అవకాశమూ లేకపోతే వారు పోరాడతారు.
  • పరిస్థితులు మారినప్పుడు మనం మారిపోవడం ధైర్యం.
  • దైర్యం ఉన్నవాడు సంక్షోభాల్లోనూ స్థిరంగా ఉంటాడు.
  • సమస్యల్ని చూసి పరిగెట్టే వాడే కాదు, ఎదుర్కొని జయించే వాడే నిజమైన ధైర్యవంతుడు.
  • దైర్యం కలవారే ప్రపంచాన్ని మార్చగలరు.
  • భయం చీకటి కడలైతే, ధైర్యం దీపం వంటిది.
  • నువ్వు ఎదుర్కొన్న ప్రతీ అవమానంలో ఒక మహత్కార్యం దాగి ఉంటుంది.

సామెతలు

[మార్చు]
  • పిల్లి గర్జించినా సింహానికి భయం ఉండదు.
  • ధైర్యముంటే ఎడారిలో కూడా నీళ్లూ కనిపిస్తాయి.
  • భయాన్ని జయించేవాడు ధైర్యవంతుడు.
  • ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యం.
"https://te.wikiquote.org/w/index.php?title=ధైర్యం&oldid=25616" నుండి వెలికితీశారు