నరేంద్రమోడి
స్వరూపం
నరేంద్ర మోదీ గుజరాత్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు ప్రస్తిత గుజరాత్ ముఖ్యమంత్రి. 1950 సెప్టెంబర్ 17న జన్మించినాడు.
నరేంద్ర మోదీ యొక్క వ్యాఖ్యలు
[మార్చు]- తప్పు చేస్తే శిక్షించండి, అంతేకాని క్షమాపణలు చెప్పను[1]
- నాపై రాళ్ళు విసిరితే ఆ రాళ్ళనే మెట్లుగా మార్చుకుంటా[2]
- ఈ కోతి, ఎలుకకు ఆరుకోట్ల గుజరాత్ ప్రజలే శ్రీరాముడు, గణేశుడు (తనపై చేసిన విమర్శలకు మోదీ సమాధానం)[3]
- ప్రధానిగా రాత్రి కాపలాదారుని పెట్టారు (మన్‌మోహన్ సింగ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య)[4]
- అధికరణం-370 కాశ్మీర్‌కు మేలేనా? [5]
- దేశాన్ని అమ్మితే తప్పు కాని, చాయ్ అమ్మితే తప్పేమి?
- సత్యం,స్వచ్చత,స్వార్ధ రహిత ఆలోచనలను కలిగినవారు..తమను ప్రపంచమంత వ్యతిరేకించినా భయపడాలిసిన అవసరం లేదు.[6]
- మహిళాభ్యుదయానికి కృషి చేయకుండానే దేశాన్ని, ప్రపంచాన్ని బాగుపర్చడం అనేది అసాధ్యమైన పని,ఏ మాత్రం అవకాశం లేని పని.
- ఉల్లాసంగా ఉండే మెదడు ఒక విషయంపై స్థిరమైన అభిప్రాయానికి రావడానికి సాయపడుతుంది.తెలివి తేటలున్నప్పటికీ కొన్ని బంధనాల మధ్య కట్టడి చేసుకొన్న మెదడు వేయి రకాల డిఫికల్టిస్ ను సృష్టిస్తుంది.
- విశ్వం,దేవుడు....రెండూ వేరు వేరు కాదు.ప్రపంచమే ఒక భగవత్స్వరూపం.సృష్టికారుడి మాయ. ఆ అద్భుత స్వరూపాన్నే మనం ప్రపంచంగా పిలుచుకొంటున్నాం
నరేంద్ర మోదీపై ఇతరులు చేసిన వ్యాఖ్యలు
[మార్చు]- నరేంద్ర మోదీ... ఓ పులి -- విజయ్ దర్దా (కాంగ్రెస్ ఎంపీ)[7]
- అర్జునుడిలాంటి చూపు నరేంద్ర మోదీకి ఉంది-- అనిల్ అంబాని[8]