నెపోలియన్
Appearance
నెపోలియన్ బోనపార్టీ (Napoleon Bonaparte) (15 ఆగస్టు 1769 – 5 మే 1821) ఫ్రాన్సుకు చెందిన సైనిక అధికారి మరియు రాజకీయ అధిపతి. ఫ్రెంచి విప్లవకాలంలో ఇతను ప్రముఖపాత్ర వహించాడు.
నెపోలియన్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు
[మార్చు]- ఈ పిరమిడ్ల ఎత్తుమీంచి, నలభై శతాబ్దాలు మనల్ని కిందికి చూస్తుంటాయి.
- ఆయన దళాలకు 21 జూలై 1798న చేసిన ప్రసంగంలోని భాగం. నెపోలియన్ ఫ్రెంచి ఆత్మకథలో ప్రచురితం.
- అసంభవం అనే పదం ఫ్రెంచి భాషలో లేదు.
- జనరల్ జీన్ లె మారొఇస్‌కు వ్రాసిన ఉత్తరం(9 జూలై 1813)లో, ఎడ్వర్డ్ లాథం తయారుచేసిన ఫేమస్ సేయింగ్స్ అండ్ దెయిర్ ఆథర్స్ (1906)లో ప్రచురితం - పేజీ.138.
- నేను దేవుడు సృష్టించిన రాజుని, భూమ్మీది పాములూ, మొసళ్ళూ(సరీసృపాలు) అయిన మీరు నన్ను ఎదరించేందుకు ధైర్యం చేయకండి. దేవుడికీ, ఏసుక్రీస్తుకీ తప్ప మీలాంటివారికెవరికీ నా ప్రభుత్వపు లెక్కాజమా అప్పజెప్పబోను.
- ‘కేథలిక్, ప్రొటెస్టెంట్ మతాధికారులతో బోనపార్టే సమావేశం’లో సమావేశమైన కేథలిక్ మతాధికారుల ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు.
- మరో అనువాదాన్ని అనుసరించి:నన్ను దేవుడు సింహాసనంపై నిలబెట్టాడు, భూమిపైన సరీసృపాల్లారా మీరు నన్ను ఎదరించే ధైర్యం చేయకండి. నా పరిపాలన తాలూకూ లెక్కాజమా పోప్‌కి చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు-కేవలం దేవుడికీ, ఏసుక్రీస్తుకీ చెప్పుకుంటాను.
- అల్ప విషయాలే మానవునికి మార్గదర్శకాలు.
- మనం ఏదైనా కోల్పోవడానికి ఒక్క క్షణమే పట్టవచ్చు.
- నువ్వు నాకు తల్లినిస్తే ....నేను నీకు మంచి దేశాన్నిస్తాను.
- యుద్ధం అనేది అనాగరికులు చేసే వ్యాపారం.
- ప్రతి నిముషాన్ని వ్యర్ధం చేయక వినియోగించుకో, లేకుంటే నీవు వృధా పుచ్చిన కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది.
- నాయకుడంటే ఒక ఆశాసౌధం లాంటివాడు.
- ప్రపంచంలో మేధావులందరి కన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.
- నన్ను కాలం తప్ప మరేదైనా అడుగు, అదొక్కటే నా చేతిలో లేదు.
- మనము నిరుపేదగా ఉండడానికి భగవంతుడు కారణం కాదు, మనమే కారణం. మొదట నిజమైన కారణాన్ని తెలుసుకుందాము. తరువాత దీపం వెలిగించి పెట్టి భాద్యత కొరకు అగ్గిపుల్లను వెతుకుదాము.
- ఒక్క కాలం తప్ప మరేదైనా మన చేతిలోనే ఉంటుంది.
- వెయ్యి తుపాకుల కంటే వ్యతిరేకించే నాలుగు వార్తాపత్రికలకు భయపడాలి.
- అవకాశం రానప్పుడు, అవకాశాన్ని సృష్టించుకోలేనప్పుడు ఎంత సమర్ధత ఉన్నా నిష్ప్రయోజనమే.
I am a monarch of God's creation, and you reptiles of the earth dare not oppose me. I render an account of my government to none save God and Jesus Christ. Addressing members of the Catholic clergy assembled during ‘Bonaparte's Conference with the Catholic and Protestant clergy at