పద్మిని

వికీవ్యాఖ్య నుండి

పద్మిని కొందరి వ్యక్తిగత పేరుగా ప్రస్తుతం మనందరికీ పరిచయం.

పద్మిని జాతి స్త్రీలు[మార్చు]

  • కామసూత్రాలలో వాత్స్యాయనుడు క్రోడీకరించిన పద్మిని జాతి స్త్రీల లక్షణాలు -
    • ఆమె ముఖము పున్నమి నాటి చంద్రుని వలె విరగబూసి ఉండును
    • ఆమె శరీరము అంగ సౌష్టవము కలిగి యుండి ఆవ పుష్పము వలె మృదువుగా ఉండును
    • చర్మము సున్నితంగా ప్రకాశవంతమై ఉండి సౌందర్యము కలిగి ఉండును. ఎన్నడునూ నల్లబడదు
    • లేడిపిల్ల కళ్ళ వలె అందమైన కవ్వించే కళ్ళు, వాటి మూలలకు ఎరుపుదనమ కలిగి ఉండును
    • ధృఢమైన, ఎత్తైన పిరుదులు కలిగి ఉండును
    • ఆమె కంఠభాగము ముచ్చట కలిగించును
    • చక్కని ముక్కు కలిగి ఉండును
    • ఆమె యోని తామర పుష్పము వలె ఉండును
    • ఆమె యోని స్రవించే ద్రవాలు అప్పుడే విచ్చుకొన్న కలువ పూల సువాసనలను వెదజల్లును
    • హంసను పోలిన నడక కలిగి ఉండును
    • స్వరము కోకిల కంఠము వలె మృదుమధురముగా సంగీత స్వరమును పోలి ఉండును
    • తెల్లని వస్త్రాలని, మంచి ఆభరణాలని ఇష్టపడును
    • మితాహారి అయి, మిత నిద్ర కలిగి ఉండును
    • ఇతరుల ఎడల గౌరవము, దైవము యందు భక్తి కలిగి యుండును
    • తెలివైనది అయి ఉండి మర్యాద పూర్వకముగ ఉండును
    • దైవపూజ పై ఎల్లప్పుడూ ఉత్సుకత కూడినదై ఉండి, బ్రాహ్మణులతో సంభాషణలని ఆనందించునదై ఉండును
"https://te.wikiquote.org/w/index.php?title=పద్మిని&oldid=13566" నుండి వెలికితీశారు