పాల్కురికి సోమనాథుడు
స్వరూపం
పాల్కురికి సోమనాధుడు (1160 - 1240), శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. పాల్కురిక వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే దంపతులకు జన్మించాడు. జన్మతహా బ్రాహ్మణుడైనా, వీరశైవ మతం మీద అనురాగంతో ఆ మత దీక్ష తీసుకున్నాడు. ఇతడు గురువు కట్టకూరి పోతిదేవర వద్ద శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.
సోమనాథుడి వ్యాఖ్యలు
[మార్చు]- గౌరీశు మీద దైవంబు లేడని తలయిచ్చి వడయుదును.
- శివు మీద నొకడు గలడన్న, నాయరకాలెత్తి వాని నడుదల దన్నుదు.