పీటర్ డ్రకర్
స్వరూపం
పీటర్ ఫెర్డినాండ్ డ్రకర్ (ఆంగ్లం: Peter Ferdinand Drucker, 19 నవంబరు 1909 - 11 నవంబరు 2005) ఆస్ట్రియాలో జన్మించిన అమెరికన్ రచయిత, నిర్వహణా సలహాదారు మరియు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు.
The Future of Industrial Man (1942)
[మార్చు]- ప్రతి వ్యక్తికీ సంఘంలో స్థానాన్ని ఏర్పరచే వరకు, ప్రతి వ్యక్తికీ పనిని ఇచ్చే వరకూ మరియు నిర్ణయాత్మక సాంఘిక శక్తిని చట్టబద్ధం చేసే వరకూ ఏ సంఘమూ సంఘం వలె పని చేయలేదు.
The New Society (1950)
[మార్చు]- ఉత్పాదకతకి, సామర్థ్యానికి అతి పెద్ద ప్రోత్సాహకాలు ఆర్థికపరమైన వాటి కంటే కూడా సాంఘికపరమైనవి మరియు నైతికపరమైనవి.
The Practice of Management (1954)
[మార్చు]- వ్యాపార ప్రయోజనానికి ఏకైక ఆమోదయోగ్యమైన నిర్వచనం కలదు: వినియోగదారుని సృష్టించుకోవటం .
- ప్రజల బలాలపై కాకుండా వారి బలహీనతలపై దృష్టి కేంద్రీకరించే మనిషిని ఎన్నటికీ నిర్వాహక హోదాలో నియమితుడిని చేయరాదు.
- ఒక మనిషిలో పనితనం పెరిగే కొద్దీ, అతడు చేసే తప్పులు కూడా పెరుగుతాయి - ఎందుకంటే అతడి ప్రయత్నాలు పెరుగుతాయి కాబట్టి. అసలు తప్పులే చేయని వ్యక్తిని, అందునా పెద్ద తప్పులు చేయని వ్యక్తిని నేను అత్యున్నత స్థాయికి ప్రోత్సహించను. ఎందుకంటే తప్పు చేయని వాడు, కేవలం సగటు పనివాడు మాత్రమే.
- ఒక కార్మికుడు బాధ్యతని తీసుకుంటాడా లేదా అన్నది అనవసరం... అది (కార్మికుడు బాధ్యతని తీసుకునేలా చేయటం) సంస్థ హక్కు
- సంస్థ అనేది ఒక వ్యక్తి యొక్క ఇల్లు, కుటుంబం, మతం లేదా జీవితంగా చెప్పుకోకూడదు. అతని వ్యక్తిగత జీవితం లో గానీ పౌరసత్వం లో గానీ అది ఎప్పటికీ జోక్యం కలుగజేసుకోకూడదు. స్వచ్ఛందమైన, రద్దు చేసుకొనే వీలు గల ఒక ఉద్యోగ ఒప్పందంతోనే అతను సంస్థకి ముడిపడి ఉన్నాడు గానీ, ఒక ఆధ్యాత్మిక లేదా స్థిరమైన బంధం తో కాదు.
- ఒక నిర్వాహకుడు లక్ష్యాలని నిర్దేశిస్తాడు - ఒక నిర్వాహకుడు ఏర్పాటు చేస్తాడు - ఒక నిర్వాహకుడు ప్రేరణని అందిస్తాడు మరియు భావాన్ని వ్యక్తీకరిస్తాడు - ఒక నిర్వాహకుడు కొలబద్దలని స్థాపించి కొలుస్తాడు - ఒక నిర్వాహకుడు ప్రజలని వృద్ధి చేస్తాడు .
Landmarks of Tomorrow: A Report on the New 'Post-Modern' World (1959)
[మార్చు]- కేవలం కళలు మాత్రమే పత్యక్ష అనుభవాన్నిచ్చేవి. వాటిని విద్యావ్యవస్థ నుండి తొలగించటం, ఇంకా దారుణంగా వాటిని సాంస్కృతిక ఆభరణాలుగా పరిగణించటం విద్యావ్యవస్థకీ, సమాజానికీ కూడా చేటు. అతి జాగ్రత్తపరులు, డాంబికాలకి పోయేవారే "కళాత్మక ప్రదర్శనలు కేవలం బానిసలకే" అనే ఈ దురభిప్రాయాన్ని మన మీద బలవంతంగా రుద్దారు.
- పుస్తక పాఠ్యాంశాలలో ఒక విద్యార్థి కేవలం విద్యార్థిగానే పని చేయగలడు. అతను ఎంత పనిమంతుడు అనే దానికంటే, అతను ఎంత అభ్యసించగలడు అన్నదే కొలవగలం. పాఠ్యాంశాలని అభ్యసించటం ద్వారా అతను ఏదయినా చేయగలిగితే అది కేవలం ఒక వాగ్దానం.
- స్వామ్యవాదం అశుభం. పాపపూరిత అసూయాద్వేషాలు దానిని నడిపే శక్తులు.
1960 వ దశకం
[మార్చు]- పెద్ద సంస్థలు బహుముఖంగా ఉండలేవు. రాశిలో బరువు తూగుతాయి గానీ చురుకుదనంలో కాదు. ఈగలు ఎంత ఎత్తుకైనా ఎగురగలవు గానీ, ఏనుగులు కాదు.
- The Age of Discontinuity (1969)
MANAGEMENT: Tasks, Responsibilities, Practices (1973)
[మార్చు]- ఈ సంఘం ఉద్యోగుల సంఘం అయిపోయినది
- సంస్థ లేనిదే నిర్వహణ లేదు. కానీ నిర్వహణ లేనిదే సంస్థ లేదు
- ప్రజలని కేవలం కలిగి ఉండటం కంటే వారికి నాయకత్వం వహించటం నేర్చుకోవలసి ఉన్నది.
- [అత్యున్నత నిర్వహణా కార్యకలాపాలకి కావలసిన మనిషి]..."ఆలోచన గల మనిషి" ..."పనిచేయగల మనిషి" ..."ప్రజల మనిషి" ..."ముందు నిలబడే మనిషి" ...ఈ నాలుగు స్వభావాలు ఒకే మనిషిలో అత్యంత అరుదుగా కనిపిస్తాయి ...అత్యున్నత నిర్వాహకుడు కేవలం ఒక మనిషి కావటమే వ్యాపారవిస్తరణ విఫలమవ్వటానికి అతి పెద్ద కారణం.
మొదటి భాగం
[మార్చు]- భవిష్యత్తు గురించి మనకి తెలిసిన ఒకే ఒక విషయం, అది వేరుగా ఉంటుందని
- లాభ గరిష్టీకరణ, వాస్తవానికి అర్థరహితం.
- లాభం కారణం కాదు గానీ ఫలితం.
- అసలు ఏ ప్రాధాన్యతని ఎంచుకోలేకపోవటం కంటే ఏదో ఒక ప్రాధాన్యతని ఎంచుకోవటమే మంచిది
- నిర్ణయాలు కేవలం వర్తమానంలో కలవు.
- దోషం మనుషుల్లో కాదు, వ్యవస్థలో ఉన్నది.
- కేవలం చేతిని నియమించుకోలేం, మొత్తం మనిషి దానితో బాటు ఎప్పుడూ వచ్చేస్తాడు.
- మనకి కొత్త చట్టాలు అవసరం లేదు. చట్టాలకి ఏ దేశంలోను కొరత లేదు. మనకి కావలసింది కొత్త నమూనా.
రెండవ భాగం
[మార్చు]- ఏ పై అధికారి అయితే తనకై తాను స్వయంగా పురోగతి దిశగా పయనిస్తాడో అటువంటి వాడు తిరుగులేని ఉదాహరణ గా నిలిచిపోతాడు.
- ఒక సంస్థ యొక్క ఉద్దేశ్యము, సాధారణ మనుషులతో అసాధారణ పనులని చేయించగలగటం.
- నిర్ణయాలు తీసుకోవటంతో బాటు నిర్వాహకులు చాలా పనులు చేస్తారు. కానీ నిర్ణయాలు నిర్వాహకులు మాత్రమే తీసుకొంటారు. కాబట్టి ఒక నిర్వాహకుడి నైపుణ్యం ప్రాథమికంగా సరైన నిర్ణయం తీసుకోవటంలోనే ఉంటుంది.
- ఏమీ చేయకపోతే పరిస్థితి దిగజారిపోతుంది అనే సూచన కనబడినపుడు నిర్ణయం ఆవశ్యకమౌతుంది.
మూడవ భాగం
[మార్చు]- సంస్థాగతంగా అవసరమైనది - మరియు ఆవిర్భవిస్తున్నది - వ్యవస్థల నిర్వహణ.
- రాబోయే కాలం సాంకేతికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా వేగవంతమైన మార్పులకి లోనై వినూత్నంగా ఉంటుంది అని చెప్పటానికి కావలసినన్ని సూచనలున్నాయి.