పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి
స్వరూపం
పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి కావలి పట్టణంలో ప్రజావైద్యునిగా ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన వ్యక్తి. ప్రముఖ కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య తమ్ముడు. నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు, కావలి పట్టణానికి చెందిన విశ్వోదయ కళాశాలల సహ వ్యవస్థాపకుడు. జనబాహుళ్యంలో డాక్టర్ రాం అన్న పేరు వ్యాప్తిలో ఉంది.
పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు
[మార్చు]- సాంఘిక వ్యవస్థ, ప్రజల ఆర్ధిక జీవన విధానం సమూలంగా మారితే గానీ, తిండి తిప్పల్లో ఒక మార్పు రానిదే. ఆరోగ్యం శుభ్రత చేకూరవు.
- కనిపించిన ప్రతి రోగి/కన్న బిడ్డ కాదట్రా?/తన మన అంతరమేదీ?/తనువే మనకీ లేదా?
- బీదరికం రోగాన్ని తెస్తుంది. బీదరికాన్ని, దానికి కారనమైన సామాజిక దోపిడీదారి విధానాన్ని ధ్వంసం చేయడం ,చాలాకాలం తీసుకొంటుంది. ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేయాల్సి ఉంటుంది. అంతవరకు రోగాలు వేచి ఉంటవా? అందుకే ప్రతి కమ్యూనిస్టు కార్యకర్తకూ కొంత ప్రాథమిక వైద్యం రావాలి. వారు చేసే ప్రాథమిక చికిత్స, చిట్కావైద్యం వంటివి పేదలకు ఉపయోగపడాలి.
- అహంకారమా! పో ! పో! / కారాలన్నీ పోయి తీపి రావాలి! / ఎగో(అహంకారం) లేక పోవడమే యోగం .
- అహంతో తప్ప తాగి మతిలేని వాడివైనావు.ఈ మత్తుపోతేనే నీకు యోగం పొతు కుదురుతుంది. అప్పుడే దయ్యం వదిలి దైవమవుతావు
పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గురించి ఇతరుల వ్యాఖ్యలు
[మార్చు]- His life was a triple stream of compassion, wisdom and freedom. He is a realistic idealist - సంజీవ దేవ్, కళాకారుడు, రచయిత.[1]
- పుస్తకాల పుటల్లో నిక్షిప్తం కాని కాలేని వ్యక్తిత్వం రాం ది. ఏ రచయితకు అంతు చిక్కదు ఆ శైశవ దరహాస హేల. ఏ శిల్పరుచికీ లొంగదు ఆ త్యాగ నిరతి మధురిమ - జి.కృష్ణ, ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు.[2]
- My husband was a mountain of strength ,ocean of generosiy and a sea of self -sacrifice - పుచ్చలపల్లి రాజ్యలక్ష్మి, రామచంద్రారెడ్డి భార్య.
- డా.రాం ప్రజా వైద్యుడు. ఉద్యమకారుడు. గొప్పవ్యక్తి. మంచి వ్యక్తి. కానీ పొరపాటున దేవుడిని చేసేసేరు జాగ్రత్త - వకుళాభరణం రామకృష్ణ.