పురాణం సుబ్రహ్మణ్యశర్మ
స్వరూపం
పురాణం సుబ్రహ్మణ్య శర్మ తెలుగు వారపత్రికలలో ఒక ఒరవడి సృష్టించిన మంచి సంపాదకులలో కొడవటిగంటి కుటుంబరావు సరసన నిలబడగల వారిలో ప్రధముడు. ఆంధ్రజ్యోతి వారపత్రిక కు చాలా కాలం సంపాదకులుగా ఉండి ఆ పత్రిక ద్వారా మంచి సాహిత్యసేవ చేశారు. సంపాదకునిగా, కథారచయితగా, శీర్షికా రచయిత(కాలమిస్ట్)గా బహుముఖీనంగా సాహిత్య సృష్టికి కృషిచేశారు.