పెనుకొండ

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
కోట ముఖద్వారం

పెనుకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణం. క్రీ.శ.1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లింరాజుల సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసినాకా విజయనగర సామ్రాట్టులు తమ రాజ్యాన్ని కొన్నాళ్ళ పాటు పెనుకొండకు మార్చారు.

వ్యాఖ్యలు[మార్చు]

చనిన నాళుల తెనుగు కత్తులు
సానవెట్టిన బండ, ఈ పెనుగొండ కొండ

రంధ్రముల ప్రహరించు శత్రుల, రక్తధారల త్రావి త్రేచిన
ఆంధ్ర, కన్నడ రాజ్యలక్ష్ముల, కరితి నీలపు దండ, ఈ పెనుగొండ కొండ

వెరపులెరుగని బిరుదు నడకల, విజయనగరపు రాచకొడుకులు
పొరలబోయగ కరడుకట్టిన పచ్చినెత్తురు కొండ, ఈ పెనుగొండ కొండ

తిరుమలేంద్రుని కీర్తి తేనెలు, బెరసి దించిన కాపుకవనపు
నిరుపమ ద్రాక్షారసంబులు నిండి తొలికెడు కుండ, ఈ పెనుగొండ కొండ

--రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

మూలాలు[మార్చు]

  • తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=పెనుకొండ&oldid=13267" నుండి వెలికితీశారు