పొత్తూరి విజయలక్ష్మి
స్వరూపం
పొత్తూరి విజయలక్ష్మికథా, నవలా రచయిత్రి. ఈవిడ హాస్య కథలకు, నవలలకూ పేరుపొందింది. ఈమె జూలై 18, 1953న గుంటూరు జిల్లా యాజలి గ్రామంలో జన్మించారు. ఈమె నవల 'ప్రేమలేఖ'ను తెలుగు సినిమాగా రూపొందింది. 250 పైగా కధలు,14 నవలలు రాసింది.సాహిత్యంలో అనేక పురస్కారాలు అందుకుంది.
వ్యాఖ్యలు
[మార్చు]శైలజ,చందు తదితరులు. అష్టదిగ్గజాలంటే ఆరు. హైదరాబాద్, హాస్యప్రియ పబ్లికేషన్స్,2019.
- హాస్యానికన్నా మంచి మందు లేదు.
- హాస్యం నా ఊపిరి. హాస్యం నా ప్రాణం. హాస్యం నా బలహీనత. హాస్యం నా చిరునామా.
- హాస్యం రాసిన వారందరూ నాకు అభిమాన రచయతలు.
- మొరటు మాటలు, వెకిలి చేష్టలు హాస్యంగా చెలామణి అయిపోవడం బాధాకరమైన విషయం
- పరిశీలిస్తే ప్రతి వ్యక్తి కమెడియనే
- మా ఇంట్లో అందరూ కమెడియన్లే..! హీరోలు..విలన్లు లేరు
- హాస్యానికి విపరీతమైన జనాదరణ ఉంది. ఎవరో కొద్దీ మంది తప్ప మిగిలిన వారందరు హాస్యాన్ని ఆస్వాదిస్తారు.
- కొంతమంది రచయతలు పరిచయం లేకపోయినా తమ రచనల ద్వారా పాఠకులకు ఆత్మీయంగా అనిపిస్తారు.