బాపు

వికీవ్యాఖ్య నుండి

బాపు ప్రముఖ చిత్రకారుడు, సినీదర్శకుడు. చిత్రలేఖనంలో వ్యంగ్యచిత్రాలు, కారికేచర్లు, పుస్తకాల కవర్ పేజీలు, లోగోలు మొదలుకొని అన్నిరకాల్లోనూ ఆరితేరిన వ్యక్తి. ఆయన బొమ్మలు తెలుగుతనానికి చిరునామాగా పేర్కొంటూంటారు. సినీరంగంలోనూ, చిత్రలేఖనంలోనూ మాత్రమేకాక నిజజీవితంలో కూడా తన సన్నిహిత మిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణతో విడదీయరాని అనుబంధం పెనవేసుకుని సారస్వత రంగంలో బాపురమణలనే జంటపేరుతో ప్రసిద్ధులయ్యారు.

బాపు వ్యాఖ్యలు[మార్చు]

  • బాపు దర్శకత్వంలో వంశవృక్షం సినిమా తీశాకా విడుదలకు ముందు ప్రత్యేక ప్రదర్శనలో మీరింతకు ముందు ట్రాజెడీలు తీసినట్టులేదే అని ఎవరో అడిగారు బాపును. ఆయన గంభీరంగా "కానీ తీశాకా కొన్ని ట్రాజెడీలే అయ్యాయి లెండి" అని చమత్కరించారు.[1]
  • ఒక ఉత్తమయిల్లాలు. ఆవిడ భర్తతో తప్ప సినిమాకి వెళ్ళదు. నా సినిమా రాగానే భర్తతో, "ఏవండీ బాపుగారి సినిమా రిలీజయింది, ఇవాళ మొదటాట కెడదామండీ," అనేది. ఆయన "ఇవాళ శుక్రవారం కదే.రేపాది వారం వెడదాం" అనేవారు. ఆవిడ, "అంతవరకూ ఉండదండీ," అని కంటనీరు తుడుచుకొనేది.[2]

బాపు గురించిన వ్యాఖ్యలు[మార్చు]

ప్రముఖులు/సన్నిహితుల వ్యాఖ్యలు[మార్చు]

  • బాపు కొంత కోపిష్టి కానీ చాలా మంచి హృదయం. మిత భాషి. ఏమడిగినా చిరునవ్వే సమాధానం. "నాకు 'జనగండం' ఉంది. అందుకే ఎక్కడా మాట్లాడలేను" అని తనమీద జోక్స్ వేసుకునేవాడు. రమణ కొన్నిమాటలైనా మాట్లాడేవాడు. బాపుని ఎప్పుడూ పక్కనే ఉంటూ చూసుకునేవాడు. బాపు రమణలు 'గీతరచనలూ'. మన తెలుగుజాతి, సాంప్రదాయం, శైలి, భాష, చిత్రకళా వున్నంతకాలం వాళ్ళిద్దరూ ఉంటారు --- నిస్సందేహంగా!
--శంకర్ (సత్తిరాజు శంకరనారాయణ), పుస్తకం.నెట్ బాపుతో మేము వ్యాసంలో[3]

సినిమా పాటల్లో ప్రస్తావనలు[మార్చు]

  • బొంగరాలంటి కళ్ళుతిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పింది
అమ్మో బాపు గారి బొమ్మో
--అత్తారింటికి దారేది

మూలాలు[మార్చు]

"https://te.wikiquote.org/w/index.php?title=బాపు&oldid=17281" నుండి వెలికితీశారు