బాహుబలి
స్వరూపం
బాహుబలి 2015 మరియు 2017 సంవత్సరాలలో విడుదలైన తెలుగు సినిమా. దీనికి ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించారు.
సంభాషణలు
[మార్చు]- మాహిష్మతీ ఊపిరిపీల్చుకో, నాకొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు...దేవసేన.
- ఇది నామాట, నామాటే శాసనం...శివగామి.
- కట్టప్పా! వీళ్ల తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగేయి...శివగామి.
- నూరుమందిని చంపితే వీరుడంటారు, కానీ ఒక్కప్రాణం కాపాడినా దేవుడంటారు...శివగామి
- తప్పుచేశావ్ దేవసేన. ఆడదాని ఒంటిమీద చేయివేస్తే.. నరకాల్సింది వేలుకాదు... తల... బాహుబలి
- నాతో వచ్చేది ఎవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మాహిష్మతి...బాహుబలి
సినిమా పాటలు
[మార్చు]- దండాలయ్యా దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్యా
- కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా