Jump to content

భానుమతీ రామకృష్ణ

వికీవ్యాఖ్య నుండి
భానుమతి రామకృష్ణ 2013 స్టాంప్ ఆఫ్ ఇండియా

భానుమతీ రామకృష్ణ (సెప్టెంబరు 7, 1926 - డిసెంబరు 24, 2005) దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, నర్తకి, సంగీత దర్శకురాలు. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె ఒంగోలులో జన్మించింది. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటరు అయిన పి.ఎస్.రామకృష్ణారావును వివాహమాడింది. భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966 లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది.

వ్యాఖ్యలు

[మార్చు]

భానుమతీ రామకృష్ణ. నాలో నేను. విజయవాడ, శ్రీ మానస పబ్లికేషన్స్, 2000.

  • జీవితం లో అతి ముఖ్యమైనది నా దృష్టిలో సంతృప్తి (Contentment) కారణం అది మనిషికి కలగడం చాల కష్టం. ఇవాళ గతాన్ని తలచుకున్నప్పుడు నేనిక ఏదీ సాధించేందుకు మిగల్లేదు.
  • సామాజిక సత్యాలకు అడ్డం పట్టాలి అంటోంది నాలోని దర్శకురాలు. జీవిత సత్యాలను అన్వేషించేటటువంటి ఆత్మవ్యవసాయం కొనసాగించాలంటోంది నాలోని ఆధ్యాత్మిక తత్త్వం.
  • మ్యూజింగ్స్ అనేవి జీవితంలో ప్రతిక్షణం మనిషి బుర్రలో అటుఇటు దొర్లుతుండే ఆలోచనా తరంగాలు
  • ఒక్కొక్కసారి ఒకరితో మాట్లాడేటప్పుడు ఆ సబ్జెక్ట్ వదిలేసి ఆలోచనలు సంబంధం లేనిచోటకు వెళ్లిపోతుంటాయి. మళ్ళా బలవంతంగా వాటిని అచోటునుంచి ఈ చోటుకు లాక్కువచ్చి అప్పటి సబ్జెక్ట్ మ్యాటర్ కు వచ్చేసరికి బుర్ర కాస్త తలక్రిందులవుతుంటుంది.
  • కొంతమంది అసలు బుర్రను మ్యూజింగ్స్ లో తేలనిస్తు డూప్లికేట్ బుర్రతో యాంత్రికంగా ఎదుటివారికి సమాధానాలు చెబుతుంటారు.
  • జీవితంలో ఎన్నో విషయాలు మరచిపోతుంటాము. కొన్ని పనికిమాలినవిగా కనిపించే విషయాలు మరచిపోవలన్నా మరపుకు రావు.
  • జీవితంలో ఒక్కొక్కరు ఓకోరకంగా కష్టాలు అనుభవిస్తుంటారు. పైకి చెప్పక పోయినా - ప్రతివాళ్ల జీవితం సమస్యలమయం గానే ఉంటుంది. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకుండా ఇలాంటి సమస్యలు ఎందుకొచ్చాయని విచారిస్తూ ఉంటారు కొందరు.
  • అసలు దేవుళ్లనేవారు ఇంతమంది లేరు. ఉండేది ఒక్కడే దేవుడు. ఆ దేవుడు మానవుల మనస్తత్వాలననుసరించి రూప భేదం చెందుతుంటాడు.
  • దేవుడికి రూపం ఉందొ లేదో . . . నాకు తెలియదు కానీ మనకి తెలియకుండా మనల్ని నడిపించే శక్తి ఉందే ... అదే దైవీక శక్తి ... అదే దైవం ...
  • ఒకసారి చీకటిలో నడిచేవారికి ఎక్కడైనా వెలుతురూ కనిపిస్తే ఆ వెలుగుబాటలో నడవడానికి ప్రయత్నిస్తారు కానీ మళ్ళీ చీకట్లోకి పోలేరు.
  • కొందరి పెద్దల నోటి నుంచి కొన్ని మాటలు వూరికే రావని అనిపిస్తుంది.'మహర్షనాంతు వాచ్యార్ధం అర్ధం అనుధావతి - మానవానాంతు అర్ధార్ధం వాచ్యాహా అనుధావతి (మహర్షుల (పెద్దల)కు మాటలకంటే అర్ధం ముందు పరుగెడుతుంది. సామాన్య మానవులకు మాటలు ముందు అర్ధం వెనుక పరిగెడుతుంది) అంటారే . . .
  • జీవితంలో ప్రతిమనిషికీ ప్రతిదీ అదృష్టమే. దృష్టికి గోచరించనిది, అనుకోకుండా ఎదురు చూడకుండా జరిగే మంచి ఘటనలన్నీ అదృష్టాలే.
  • జీవితంలో గంభీరంగా సీరియస్ గా కనపడే వారు కామెడీ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు.
  • జరగబోయేదంతా ముందుగానే మనిషికి తెలిస్తే తట్టుకోగలుగుతాడా? చీకటి వెలుగులతో నిండిన ఈ జీవితంలో మనిషికి భవిష్యత్తు గురించి ముందే ఎందుకు తెలియక ఉండాలో భగవంతుడు ఆలోచించినట్లనిపించింది.

భానుమతీ రామకృష్ణ గురించి

[మార్చు]
  • "మల్టీ ఫేసేటేడ్ క్వీన్ అఫ్ ఇండియన్ సినెమా" అన్న ఒక్క మాటలో భానుమతి గారికి చక్కగా నిర్వచనం ఇచ్చారు ఎవరోగాని. ఒక వ్యక్తిలో సంగీతం, సాహిత్యం, నటనా వైదుష్యం,కార్య నిర్వహణా దక్షత, దర్శకత్వ ప్రతిభా, ఎడిటింగ్ నైపుణ్యం, పాటలు వ్రాయడం, సంగీతం సమకూర్చడం, స్టూడియో నిర్వహణా, మంచితనం, మానవత్వం, ధైర్యం --ఇలా అన్నన్ని సుగుణాలు ఎలావచ్చాయో అని ఆలోచిస్తే అది భగవద్దత్తం అని అనిపించక మానదు.
  • భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం. [1]
  • Paluvayi Bhanumathi Ramakrishna (Telugu: భానుమతీ రామకృష్ణ) was a multilingual Indian film actress, director, music director, singer, producer, book writer and songs writer. Most of her works are in Telugu and Tamil languages. She was awarded the Padma Bhushan in 2003 for her contribution towards Indian cinema. She was honored among "women in cinema" at the 30th International Film Festival of India. She received Government National Award for Best Writer for the book నాలో నేను [Nalo Nenu] , an autobiography in 1994.[2]
  • P. Bhanumathi Ramakrishna was a trailblazer who broke many barriers and stereotypes in the male-dominated film industry. She was an inspiration to many women who followed her footsteps and pursued their dreams in cinema and other fields. She was a true icon of Telugu culture and a pride of India.[3]
  • అసలు 'భయం','మొహమాటం' అనేవి భానుమతిగారి తత్వానికే విరుద్ధం!
  • నిండు మనంబు,నవ్య నవనీత సమానము:పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము.[4]
  • అత్తగారి కథలు అత్తకోడళ్ళ పోట్లాట అని అందులో అత్త గయ్యాళి అని చాలామంది అనుకుంటారు.తరచి చూస్తే ఆ కథల్లో వారిద్దరి మధ్య చక్కటి అనుబంధం కనిపిస్తుంది.
  • తన సినిమాలు వేటిలోనూ స్త్రీ పాత్రలను తక్కువ చేసి చూపలేదు.ఆమె సినిమాలలో చాలా వరకు ధీర వనితలే కనిపిస్తారు. మహిళలను గౌరవించాలని వారు శక్తిమంతులని సరిఅయిన అవకాశం లభిస్తే అన్ని రంగాలలో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారని చెప్పేవారు.
  • ఆమె పథం మహోజ్వలం. ఆ దైర్యసాహసాలు మహిళలందరికీ ఆదర్శం. తెలుగు సినీ, సాహిత్య రంగాలలో భానుమతి గురుతులు చిరస్మరణీయం.

[5]

సూచనలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. భానుమతీ రామకృష్ణ.తెలుగు బిడ్డ. http://www.telugubidda.in/content/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%A4%E0%B1%80-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3
  2. Bhanumathi Ramakrishna.Goodreads. https://www.goodreads.com/author/show/5989654.Bhanumathi_Ramakrishna
  3. Remembering P.Bhanumathi Ramakrishna on Her 100th Birth Anniversary. Telugu Film Producer Council. https://tfpc.in/remembering-p-bhanumathi-ramakrishna-ohamatamn-her-100th-birth-anniversary/
  4. డి.వి.నరసరాజు.ముందుమాట. భానుమతీ రామకృష్ణ, నాలోనేను. శ్రీమానస పబ్లికేషన్స్, 2000
  5. శారదా అశోకవర్ధన్. కళాసరస్వతి భానుమతి. ఈనాడు. 2024-09-07