మాయాబజార్
విజయా వారి మాయాబజార్ తెలుగు సినిమాల్లోకెల్లా అత్యత్తమమైంది. ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి తదితరులు నటించారు. సినిమాకు కె.వి.రెడ్డి దర్శకత్వం వహించగా నాగిరెడ్డి-చక్రపాణి నిర్మించారు.
సంభాషణలు
[మార్చు]- ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి. వెయ్యిండి రెండు వీరతాళ్ళు.
- మాయబజార్ సినిమా విజయం రాజకీయ సామాజిక చైతన్యానికి ఆధారం[1]
చినచేపను పెదచేప చినమాయను పెనుమాయ
అది స్వాహా.. ఇది స్వాహా.. అది స్వాహా ఇది స్వాహా
- శాస్త్రం ఏది చెప్పినా ఎప్పుడూ నిష్కర్షగానూ కర్కశంగానే చెబుతుంది, మనం సారాంశం గ్రహించాలి-అంటే శాస్త్రం ఎలా ఉన్నా ఒక సమన్వయం లో ఉంటుందన్నమాట.
- సొంత తెలివిలేనివాళ్ళకు గాని శాస్త్రం మీకూ మాకూ ఎందుకు?
- నాయకుడు అనగా సేవకుడు ఆ తత్వం మరచిపోవద్దు
పాటలు
[మార్చు]- లాహిరి లాహిరి లాహిరి లో
- రసమయజగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో, ఎల్లరి మనములు ఝల్లనజేసే చల్లనిదేవుని అల్లరిలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా.
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ..
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ.. ఆ..ఆ..ఆ..ఆ..
తారా చంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో..
తారా చంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో || లాహిరి లాహిరి ||
అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే ఈ కలకలలో... మిలమిలలో...
అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరణలో || లాహిరి లాహిరి ||
రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో..
ఎల్లరిమనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో || లాహిరి లాహిరి ||
- నీవేనా నను తలచినది నీవేనా నను పిలచినది
- కలలోనే ఒక మెళకువగా, ఆ మెళకువలోనే ఒక కలగా; కలయో నిజమో వైష్ణవమాయో తెలిసీ తెలియని అయోమయంలో
- నీ కోసమే నే జీవించునది, ఈ విరహములో ఈ నిరాశలో
- విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా, వియోగ వేళల విరిసిన ప్రేమల విలువలు కనలేవా?
- వివాహ భోజనంబు, వింతైన వంటకంబు
- ఔరౌర గారెలల్ల, అయ్యారే బూరెలల్ల, వహ్వా రే పాయసాలు హహ్హ హహ్హ హహ్హా, ఇవల్ల నాకె జెల్ల
- ↑ 1960లో దసరా వేడుకల సందర్భంగా విలక్షణ సాహిత్యచర్చలో