మార్టిన్ లూథర్ కింగ్
స్వరూపం
ముఖ్యమైన వ్యాఖ్యలు
[మార్చు]- మనిషి దేవుని బిడ్డ; అతని రూపంలో సృష్టించాడు కనుక అతడిని దేవుడిలాగే గౌరవించాలి.
- ప్రతి ప్రగతి అనిశ్చయమే, ఓ సమస్యకు పరిష్కారం దొరికేలోపు మరో సమస్య ఎదురౌతుంది.
- ఫ్లోరిడాలో ఎస్కిమోలు ఎంత మందున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కమ్యునిస్టులు అంత మంది వున్నారు.
- ప్రతి వస్తువు విలువ కాలాన్ని బట్టి వుంటుంది.
- నిజం చెప్పాలంటే కాలం తటస్థం. అయితే దాన్ని విచ్చిన్నానికి, నిర్మాణానికి ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు.
- క్రీస్తు మతం నమ్మకం, దయల సమాహారం.
- మనిషి దేవుని బిడ్డ, అతని రూపంలో సృష్టించాడు. కనుక అతన్ని దేవుడిలాగే గౌరవించాలి.
- స్వర్గంలో నవ్వడం నిషిద్ధమైతే నాకు స్వర్గం చేరడం ఇష్టం లేదు.
- నీరులా న్యాయం ప్రవాహంగా ప్రవహిస్తే తప్ప మనం సంతృప్తి చెందరాదు.
- నిజాయితీ పరుడు కొందరికి శత్రువౌతాడు.
- తెల్లవాడి బావమరిదిగా ఉండే కంటే వాడికి సోదరుడిగా ఉండాలనుకుంటాను.
- పాపం మౌలికంగా దేవునికి దూరం కావడమే.
- పాపాన్ని ప్రతిఘటించకుంటే పాపానికి సహకరించినట్లే.
- తక్కువ మాటలు అదే ప్రార్ధన.
- యుద్ధం మానవజాతిని కబళించే ప్లేగు వ్యాధి.అది మతాన్ని, రాజ్యాలను,కుటుంబాలను నాశనం చేస్తుంది. దీని కంటే ఏదైనా ఉపద్రవమే మేలు.
- నాకో స్వప్నం ఉన్నది. ఏదో ఒకరోజు నా నలుగురు పిల్లలూ...తమ చర్మం యొక్క రంగుతో కాకుండా, వారి గుణగణాలతో గుర్తించబడే దేశంలో నివసించాలనేదే నా స్వప్నం.
- ప్రజల్ని అనుసరించడమే నిజమైన నాయకత్వం.
- ఎగరలేకపోతే పరిగెత్తు, పరిగెత్తలేకపోతే నడువు, నడవలేకపోతే ప్రాకు, ఏదైనా చెయ్యి, కాని ముందుకు మాత్రం వెళుతూనే ఉండు.
- ప్రేమనే అంటిపెట్టుకు ఉండాలని నేను నిర్ణయించుకొన్నాను. ద్వేషం నాకు భరించలేనంత బరువు.
- ఒక శత్రువును మిత్రుడిగా మార్చే శక్తి, కేవలం ప్రేమకు మాత్రమే ఉన్నది.
- చివరకు మనం శత్రువుల మాటలను కాదు, మిత్రుల నిశబ్దాన్ని మాత్రమే గుర్తుంచుకొంటాము.