Jump to content

మెరిల్ స్ట్రీప్

వికీవ్యాఖ్య నుండి

మేరీ లూయిస్ "మెరిల్" స్ట్రీప్ (జూన్ 22, 1949) నాటకాలు, సినిమా, దూరదర్శన్ లలో నటించిన ఒక అమెరికన్ నటి. ఆమెను ఒక గొప్ప నటీమణులలో ఒకరిగా పరిగణించుతారు.

వ్యాఖ్యలు

[మార్చు]
  • ఒక పాత్రికేయుడు మేరీను మీ ముఖమున ఉన్న ముడతలను పోగొట్టుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేయించుకోలేదు అని ప్రశ్నించినప్పుడు ఆమె ఈ విధముగా వ్యాఖ్యానించింది.
నేను ఎప్పుడు నా నుదిటి మీద నుండి ముడతలను తీయించుకోవడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే అవి నా జీవిత సౌందర్యానికి, లేదా నా నోటిపై ఉన్న ఆశ్చర్యానికి ఫలితము, ఇంకా నేను ఎంత నవ్వానో, ఎంత ముద్దుపెట్టుకున్నానో అవి చూపుతాయి. నా కళ్ల కింద నలుపు మచ్చలు కూడా కాదు ఎందుకంటే నా బాధ, ఏడుపు జ్ఞాపకాలను వాటి వెనుక దాచుకుంటాను. అవి నాలో ఒక భాగం, నేను వారి సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాను. నేను నా ముఖ లక్షణాలను ఉంచుతాను (మార్చను) ఎందుకంటే అవి నా జీవిత అనుభవాలకు సూచిక.
  • నా గురించిన భావమేమో నాకు తెలియదు. నేను "మార్విన్ రూమ్" (1996లో తీసిన అమెరికా సినిమా) ప్రచారం చేయడానికి ఫ్రాన్స్‌కు వెళ్లాను, ఒక నిజంగా చురుకైన యువతి జర్నలిస్ట్ నాతో ఇలా అంది- “మీకు తెలుసా, నేను మెరిల్ స్ట్రీప్‌ని సమావేశమవబోతున్నాను, సంభాషించబోతున్నాను ప్రజలకు చెప్పాను, వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నా కార్యాలయంలో ఉన్న స్త్రీలు అందరూ, నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. కానీ పురుషులు మీకు భయపడుతున్నారు."
    • Liz Smith (1998). "The Meryl Streep Nobody Knows." Good Housekeeping, 227(3), September 1998, pp. 94-98; Cited in: Karen Hollinger The Actress: Hollywood Acting and the Female Star, Taylor & Francis, 2006, p. 71
  • నేను సరళంగా జీవిస్తున్నాను. నేను చాలా ఫ్యాషన్‌ని కొనుగోలు చేయను!
  • మేరీకి 60 ఏళ్లు వచ్చే సమయంలో ఆమె చేసిన వ్యాఖ్య - సరే, మనమందరం సజీవంగా ఉన్నందుకు కృతజ్ఞులం కాదా? నా వయస్సులో నాకు చాలా మంది తెలుసు, నేను నా జీవితంలో చాలా మందిని కోల్పోయాను, ఇక్కడ ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞురాలను. నా ఉద్దేశ్యం ఇదే.
Commons
Commons