Jump to content

మేరీ పార్కర్ ఫోలెట్

వికీవ్యాఖ్య నుండి
సంస్థాగత సిద్ధాంతం (Organizational Theory) మరియు సంస్థాగత ప్రవర్తన (Organizational Behaviour) లలో మార్గదర్శక పరిశోధనలు జరిపిన, ఆధునిక నిర్వహణా శాస్త్ర మాతృమూర్తిగా కొనియాడబడే మేరీ పార్కర్ ఫోలెట్

మేరీ పార్కర్ ఫోలెట్ (ఆంగ్లం: Mary Parker Follet) (సెప్టెంబరు 3, 1868 - డిసెంబరు 18, 1933) అమెరికాకి చెందిన ఒక సామాజిక కార్యకర్త మరియు నిర్వాహక సలహాదారు. ఈమె సంస్థాగత సిద్ధాంతం మరియు సంస్థాగత ప్రవర్తన పై పలు మార్గదర్శక పరిశోధనలు చేశారు.

  • ఆత్మ యొక్క అన్ని శక్తులని విడుదల చేయటమే మానవ సాంగత్యం యొక్క గొప్ప బలం.
  • సమూహ ప్రక్రియ సమిష్టి జీవ రహస్యాన్ని కలిగి ఉన్నది, ప్రజాస్వామ్యానికి ఇదే కీలకం, ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకొనవలసిన గొప్ప పాఠం, అది మన ప్రధాన నమ్మిక, లేదా రాజకీయ, సాంఘిక, అంతర్జాతీయ భవిష్య జీవితం.
  • మానవుడిని యాంత్రికత వైపు నుండి పూర్తిగా ఎన్నటికీ వేరు చేయలేము.
  • అధికారం అనగానే నాకు పెత్తనం స్ఫురిస్తుంది, ఒకరి పై లేదా ఒక సమూహం పై ఇంకొకరు లేదా ఇంకో సమూహం చెలాయించేది; కానీ పంచుకొనే అధికారం అనే భావనని కూడా అభివృద్ధి చేయవచ్చును.
  • పెత్తనం చెలాయించే అధికారం ఈ విశ్వానికి శాపం, పంచుకొనే అధికారం ప్రతి మానవ ఆత్మ యొక్క సుసంపన్నత మరియు ప్రగతి.
  • పెత్తనం చెలాయించే అధికారాన్ని మనం తుడిచిపెట్టుకుపోయేటట్లు చేయలేమని నేను అనుకొంటున్నాను, అయితే దాన్ని తగ్గించాలి అని మాత్రం అనుకొంటున్నాను.
  • అధికారం బదలాయించవచ్చని నేను అనుకోవటం లేదు, ఎందుకంటె అధికారం అంటే నాకు సమర్థత.
  • బాధ్యత మనిషి యొక్క అతి గొప్ప అభివృద్ధి కారకం.
  • నువ్వు ఎవరికి బాధ్యత అనేదాని కంటే, నువ్వు దేనికి బాధ్యత అనేదే నీ బాధ్యత యొక్క ముఖ్యమైన విషయం.
  • ప్రజాస్వామ్యాన్ని మనకి ఎవరూ ఇవ్వరు. మనమే దానిని సాధించాలి.
  • విశ్వవిద్యాలయాలలో మనకి జీవితం ఎక్కువ ఉండాలి, జీవితం లో మనకి విద్య ఎక్కువ ఉండాలి.
  • వివాదానికి పరిష్కారం రాజీ కాదు, ఆవిష్కరణ.
  • అనుభవం కష్టతరమే, దాని రాళ్ళపై నిలబడ్డ మన పాదాల నుండి రక్తమోడుతున్నా, అదిచ్చే ఫలితాలు వాస్తవాలు కాబట్టి వాటిని మనమందరం అందుకోవాలని కోరుకుంటాం.
  • అనుకరణ సోమరులకి, కలిసే ఆలోచనలు సౌకర్య ప్రేమికులకి, ఏకీకరణ సృష్టికర్తలకి.
  • వ్యతిరేకత కాదు, మనుషుల్ని ఉదాసీనత విడగొడుతుంది.
  • నాయకుడు మరియు అనుచరులు ఒక అదృశ్య నాయకుడిని అనుచరిస్తున్నారు - సర్వుల ప్రయోజనం.
  • ఒక వ్యాపారానికి కావలసిన పనితనం నుండి మనిషి పొందే గర్వం కంటే గొప్ప ఆస్తి వేరెవరికీ లేదు.
  • మన సమస్య ఎప్పటికీ ఒక్కటే, ప్రజలని నియంత్రించటం కాదు, అందరం కలసి కట్టుగా ఒక పరిస్థితిని నియంత్రించటం.
  • వ్యతిరేక శక్తులు సంగమించటమే అనంతమైన ప్రక్రియ.
  • అనుభవానికి ప్రత్యామ్నాయం లేదు.
  • సారూప్యత కాదు, మన లక్ష్యం ఏకత్వం అయి ఉండాలి. భిన్నత్వంతోనే ఏకత్వం సాధ్యమౌతుంది. భేదాలని అన్నింటినీ అంతమొందించటమో, గ్రహించటమో కాదు, అనుసంధానం చేయాలి.
  • అధికారం సమన్వయం నుండి ప్రాప్తిస్తుంది కానీ, సమన్వయం అధికారం నుండి ప్రాప్తించదు.
  • మెరుగు పెట్టాలంటే సంఘర్షణ జరిగి తీరాల్సిందే.
  • భేదాలకి భయపడటం అంటే జీవితానికి భయపడినట్లే.
  • తన పనిని చేసుకోవటానికి ఒక మెకానికల్ ఇంజినీరు ఘర్షణ పైనే ఆధారపడతాడు, ఘర్షణతోనే వయొలిన్ నుండి సంగీతం వెలువడుతుంది; ఘర్షణ నుండి నిప్పు వెలువడటం కనుగన్న తర్వాతే మనం ఆటవికత్వం నుండి బయటపడ్డాం.

Relational Organization Theory

[మార్చు]
  • చాలా కాలం నుండి మనం వ్యక్తికి సంఘానికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకొనటానికి ప్రయత్నిస్తున్నాం; ఇప్పుడిప్పుడే మనం వ్యక్తి లేకుండా సంఘం, సంఘం లేకుండా వ్యక్తి లేరని అర్థం చేసుకొంటున్నాం. ఏ అహం, స్వతంత్ర్యంగా లేదని, వ్యక్తులు పరస్పర చర్యలతో అవతరిస్తారని మనం తెలుసుకొన్న తర్వాత మనస్తత్వ శాస్త్రం పై మనం చేస్తున్న అధ్యయనం మొత్తం పెను మార్పుకి లోనవుతుంది.
  • నేను ముందుగానే చెప్పినట్టు, మానవ సంబంధాలలో ఇది సహజం: నేను నీకు స్పందించను, కానీ నువ్వు-ప్లస్-నేను కి స్పందిస్తాను. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నేను మాత్రమే కాదు, నేను-ప్లస్-నువ్వు నువ్వు-ప్లస్-నేను లకి స్పందిస్తాము. "నేను" "నిన్ను" ప్రభావితం చేయలేను, ఎందుకంటే నువ్వు నన్ను ఇప్పటికే ప్రభావితం చేశావు; అంటే, మనం కలసుకొన్న ప్రక్రియ లోనే, మనం కలసుకొన్న ప్రక్రియ వలనే, మనం వేరు వేరు వారిమి అయిపోయాం.


మూలాలు

[మార్చు]
  1. http://iassr.org/rs/020804.pdf
  2. http://womenshistory.about.com/od/quotes/a/follett.htm
  3. http://strangewondrous.net/browse/author/f/follett+mary+parker
  4. http://economics.arawakcity.org/node/676
  5. http://www.azquotes.com/author/20869-Mary_Parker_Follett
  6. http://collaborativejourneys.com/constructive-conflict-revisiting-the-genius-of-mary-parker-follett/