Jump to content

మౌనం

వికీవ్యాఖ్య నుండి

వ్యాఖ్యలు

[మార్చు]
  • మౌనం అర్ధాంగీకారం
  • మౌనమె నీ భాష ఓ మూగ మనసా
- ఆత్రేయ
  • మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిని...
-
  • మౌనంగానే ఎదగమని మొక్కనీకు చెబుతుంది... ఎదిగే కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది...
- చంద్రబోస్
  • నీవు చేసిన లోకోపకారాల గురించి మౌనంగా ఉండు. కాని నీకు ఇతరులు చేసిన సేవలను అందరికీ చాటిచెప్పు.
  • కాని నా మాటలు నిశ్శబ్దపు వాన చుక్కలలాగా కురిశాయి. మౌనం నూతి అంచులలో ప్రతిధ్వనించాయి..
  • వినిపించిన రాగాలు మధురమైనవి. కాని ఇంతకు ముందు విననివి ఇంకా మధురమైనవి. కనుక మౌనమైన వాయిద్యాలలారా! మీ సంగీతాన్ని కొనసాగించండి.
  • మనుష్యుల మధ్య సంబంధాలలో విషాదం ఎప్పుడు మొదలవుతుంది? మాటలను అపార్ధం చేసికోవడం వలన కాదు. మౌనాన్ని అర్ధం చేసుకోకపోవడం వలన.
  • మాట్లాడాల్సిందెప్పుడు? మౌనంగా ఉండాల్సిందెప్పుడు? - ఇది తెలియడం ఒక గొప్ప వరం.
  • మాటలకంటే మౌనంలో ఎక్కువ అర్ధం దాగి ఉంటుండి.
  • మౌనం చాలా బోరు కొడుతుంది.
  • నువ్వు చెప్పనవసరం లేని విషయాలు నీ సంపదలు.
    అనవసరమైన విషయాలు మాట్లాడితే సంభాషణ బలహీనమౌతుంది.
    అనవసరమైన విషయాలు వింటే నీ వినికిడి మందగిస్తుంది.
    నువ్వు వింటానికి ముందే నీకు తెలిసిన విషయాలు నీ వ్యక్తిత్వం అవుతాయి. నీ మనుగడకు అవి ప్రాణాలు.


  • నీ హృదయాన్ని తరచి చూడు. సలహాలు, ఉపాయాలు చెప్పేవారు నీకు నిజమైన సన్నిహితులు కారు. కష్టసుఖాలలో మౌనంగా నీకు తోడుండి నీ అనుభూతులను పంచుకొనేవారు, దిక్కుతోచనప్పుడు తానుకూడా నీతో విషాదాన్ని అనుభవించేవాడు నిజమైన స్నేహితుడు.
  • నీ శబ్దం కాదు, నీ శాంతమే నీ బలాన్ని చూపుతుంది.
  • ప్రతి మౌనం వెనుక ఒక గొప్ప భావన దాగి ఉంటుంది.
  • నిశ్శబ్దంలో ఉన్నది వాక్కుతో లేనంత బలంగా ఉంటుంది.
  • నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నీ ఆత్మ గొప్పగా మాటలాడుతుంది.
  • పదాలు గాయపరుస్తాయి, కానీ మౌనం నయం చేస్తుంది.
  • నిశ్శబ్దం పలికే మాటలు చాలా మందికి వినిపించవు.
"https://te.wikiquote.org/w/index.php?title=మౌనం&oldid=24993" నుండి వెలికితీశారు