మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
స్వరూపం
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (1888 నవంబరు 11 - 1958 ఫిబ్రవరి 22) (Bengali: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను అసలుపేరు "మొహియుద్దీన్ అహ్మద్", 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. అతను ప్రఖ్యాత పండితుడు, కవి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు.
వ్యాఖ్యలు
[మార్చు]- కల అంటే భావోద్వేగాలకు సంబంధించినది కాబట్టి జాతీయ విద్యలో అది తప్పనిసరి భాగం కావాలి. కల సౌందర్య ప్రస్తావన లేకుండా సెకండరీ, యూనివర్సిటీ ...ఏ స్థాయి విద్య అయినా సంపూర్ణం కాదు. [1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు.2024-11-11