Jump to content

యూరీ గగారిన్

వికీవ్యాఖ్య నుండి

యూరీ గగారిన్ రష్యన్ అంతరిక్ష శాస్త్రవేత్త, అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మానవుడు.

వ్యాఖ్యలు

[మార్చు]
  • అంతరిక్షనౌకలో భూమి చుట్టూ తిరిగేప్పుడు, మన గ్రహం ఎంత అందమైనదో చూశాను. ప్రజలారా! మనం ఈ అందాన్ని కాపాడుకుని, పెంపొందిద్దాం, నాశనం చేయొద్దు!
    • యూరీ గగారిన్, Syny goluboi planety అన్న పుస్తకపు 3వ ఎడిషన్ వెనుక ఈ వాక్యం రష్యన్ భాషలో రాసి సంతకం చేశాడు
  • ఏం అందం. దూరంగా ఉన్న ప్రియమైన భూమి మీద మబ్బులను, వాటి మెరుపుల నీడలను చూశాను... నీరు నల్లటి, చిన్న మిణుకుమనే చుక్కలా కనిపించింది... క్షితిజాన్ని చూసినప్పుడు లేతరంగు భూమి ఉపరితలానికీ, ఆకాశపు పూర్తి నిఖార్సైన నల్లరంగుకీ మధ్య ఉన్న వ్యత్యాసం కనిపించింది. భూమి విభిన్నమైన రంగులను చూసి ఆస్వాదించాను. దాన్ని లేత నీలం ప్రభామండలం చుట్టివుంటుంది, అది క్రమంగా నల్లబడుతూ, వైఢూర్య వర్ణంలోకి, గాఢమైన నీలం రంగులోకి, బొగ్గులా నల్లటి నలుపులోకి మారుతూంటుంది
    • యూరీ గగారిన్, లూసీ బి. యంగ్ రాసిన ఎర్త్స్ ఆరా (1977)లోని వ్యాఖ్య