రవీంద్రనాథ్ ఠాగూర్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
రవీంద్రనాథ్ ఠాగూర్

రవీంద్రనాథ్ ఠాగూర్ (Rabindranath Tagore) 1861 మే 7వ తేదీన బెంగాల్‌లో జన్మించాడు. ప్రముఖ కవి అయిన ఠాగూర్ 1913లో గీతాంజలి రచనకుగాను నోబెల్ బహుమతి పొంది ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. భారత జాతీయ గీతం "జనగణమణ" కూడా ఠాగూర్ రచించినదే. ఆగస్టు 7, 1941న ఠాగూర్ మరణించాడు.


రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు[మార్చు]

 • పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది.
 • కాలం చెక్కిలిపై కన్నీటి చుక్క తాజ్‌మహల్.
 • ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది.
 • మనము ఎవరిని హీనులుగా, నీచులుగా చూస్తామో వాళ్లే మనల్ని క్రమంగా, హేయంగా, దీనంగా చూస్తారు.
 • అజ్ఞానమనేది విజ్ఞానము వైపుకు పయనించవచ్చు కానీ మూఢత్వమనేది మరణానికి దారి తీస్తుంది.
 • మంచి పనులు చేస్తూ తీరుబాటు లేకుండా ఉండే వ్యక్తికి సుఖంగా జీవించడానికి కాలం దొరకదు.
 • ప్రతి గడిచిన రోజూ మనమేదైనా నేర్చుకున్నదై ఉండాలి.
 • అబద్దం గురించి కూడా నేను తప్పక నిజమే పలుకుతాను.
 • ఎవరైనాసరే నేర్చుకుంటూ ఉంటేనే తప్ప సరిగా బోధించలేరు.
 • అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి.
 • జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు,వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు.
 • మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజూ, క్రితం రోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి.
 • నేను పని చేస్తే భగవంతుడు నన్ను గౌరవిస్తాడు. అయితే నేను గానం చేసినపుడు ఆయన నన్ను ప్రేమిస్తాడు.
 • కళ్లకి రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి.
 • ప్రేమించే వ్యక్తికీ దండించే అధికారం కూడా ఉంటుంది.
 • భర్తకి లోకమంతా ఇల్లు, అయితే స్త్రీకి ఇల్లే లోకం.
 • వెలిగే దీపంలాగా ఉండు. అప్పుడే ఇతర దీపములను వెలిగించవచ్చు.
 • ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద-పవిత్రత.
 • సృష్టి రహస్యాన్ని విశదం చేయగల శక్తి తర్క కౌశలానికి లేదు.
 • మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మధ్యలో పురుషులు పసిబిడ్డలు.
 • మనిషి జీవితంలో మహదాశయాలూ శిశువుల్లా అవతరిస్తుంటాయి.
 • ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే 'కళ'.
 • నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది.
 • సౌందర్యం, సత్యం వీటి రసవత్సమ్మేళనమే కళ
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.