Jump to content

లార్డ్ మెకాలే

వికీవ్యాఖ్య నుండి
సద్గుణానికి, లేదా నీతికి అత్యుత్తమమైన నిదర్శనం హద్దుల్లేని శక్తిని కలిగివుండీ దాన్ని దుర్వినియోగం చేయకపోవడమే.

థామస్ బాబింగ్టన్ మెకాలే, మొదటి బోరన్ మెకాలే(25 అక్టోబర్ 1800 – 28 డిసెంబరు 1859) (లార్డ్ మెకాలేగా ప్రఖ్యాతుడు) 19వ శతాబ్దపు కవి, చరిత్రకారుడు, రాజనీతివేత్త. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పాలనకాలంలో భారతదేశంలో ఆంగ్ల విద్యావిధానం ప్రవేశపెట్టడం వెనుక ముఖ్యమైన వ్యక్తుల్లో మెకాలే ఒకరు.

వ్యాఖ్యలు

[మార్చు]
  • మనకు(బ్రిటీషర్లకు)న్న పరిమిత వనరులతో, మొత్తం ప్రజాసమూహాన్ని(భారతీయులు) విద్యావంతులను చేయడం అసాధ్యం. మనం ప్రస్తుతం, మనకు మనం పరిపాలించే లక్షలాది మంది ప్రజలకు మధ్య సంధానకర్తలుగా పనిచేసే సమూహాన్ని, రంగులోనూ, రక్తంలోనూ భారతీయులైనా అభిరుచులు, ఆలోనలు, నీతి, మేధస్సులో ఆంగ్లేయులు అయిన సమూహాన్ని తయారుచేయడంలో అత్యుత్తమ స్థాయిలో కృషి చేయాలి.
మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ (1835).
  • విప్లవానికి అత్యంత గొప్ప కారణమేంటంటే, దేశం ముందుకు సాగుతూంటే, రాజ్యాంగాలు ఉన్నచోటే నిలిచిపోవడం.
స్పీచ్ ఆన్ పార్లమెంటరీ రిపార్ం (1831)