లెనిన్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

లెనిన్ అనే పేరుతో ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ (ఏప్రిల్ 22, 1870 – జనవరి 21, 1924), ఒక రష్యా విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు. సోవియట్ సోషలిస్ట్ గణతంత్ర సమాఖ్య లేదా బోల్షివిక్ రష్యా దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో కొనసాగాడు. కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజం‌కు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతాన్ని లెనినిజం లేదా మార్క్స్సిజం-లెనినిజం అని అంటారు.

లెనిన్ యొక్క ముఖ్య ప్రవచనాలు[మార్చు]

  • మానవజాతి సంతరించుకున్న విజ్ఞానంతో నీ మేధస్సును సంపన్నం చేసుకున్నపుడే నీవు సామ్యవాదివి కాగలవు.
  • రాజకీయాలు ఒక శాస్త్రం మరియు ఒక కళ.
  • సామాజిక ఉత్పత్తికి తోడ్పడే శ్రమకు ఉపకరించే విధంగా విద్య ఉండాలి.
  • పురుషుల శాసనాపరమైన ప్రత్యేక హక్కులు మహిళలను దిగలాగుతున్నంత కాలం సమానత అనేది ఉండదు.
  • మానవాళి సుఖ సంతోషాల కోసం పాటుపడేవారు వాస్తవాలను ఒప్పుకోగల ధైర్యం గలవారై ఉండాలి.
  • విధానం అమలుకోసం యంత్రాంగం ఉంటుంది గానీ యంత్రాంగం కోసం విధానం ఉండదు.
"https://te.wikiquote.org/w/index.php?title=లెనిన్&oldid=16312" నుండి వెలికితీశారు