Jump to content

వాత్స్యాయనుడు

వికీవ్యాఖ్య నుండి
(వాత్సాయనుడి కామసూత్రాలు నుండి మళ్ళించబడింది)
  • వాత్స్యాయనుడు (Vātsyāyana) తన స్వపరిచయం గురించి, కామసూత్ర గ్రంథము గురించి -
వారణాసిలో విద్యార్థిగా ఉన్న సమయంలో, దైవధ్యానంలో ఉండిన వాత్సాయనుడు, బభర్వ్యుడు మరియు ఇతర ప్రాచీన గ్రంథకర్తల రచనలని చదివి, వారు తెలిపిన నీతినియమాల గురించి ఆలోచించిన తర్వాత పవిత్ర శాసనము యొక్క భావనలతో, లోక కళ్యాణమునకై ఈ సంకలనమును చేసెను. కేవలము కామాన్ని తీర్చుకొనేందుకు మాత్రమే ఈ గ్రంథముని పరికరముగా ఉపయోగించుకొనరాదు. శాస్త్ర పరిజ్ఞానము కలిగిన, ధర్మార్థకామాల గురించి ఎరిగినవాడు, లౌకిక ఆచారాలపై అవగాహన ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహమును తప్పక పొందుతాడు. క్లుప్తంగా చెప్పాలంటే ధర్మార్థకామాలని ఎరిగిన తెలివైనవాడు కోరికలకి బానిసవ్వక చేపట్టిన కార్యాలన్నింటిలోనూ సఫలీకృతుడౌతాడు.

వాత్స్యాయనుడి కామసూత్రాలు

[మార్చు]

నందీశ్వరుడు రచించిన వేయ అధ్యాయములు గల కామసూత్రాలు ఉద్ద్వాలకుని పుత్రుడైన శ్వేతకేతు ఐదు వందల అధ్యాయములకి సంగ్రహము చేసేను. మరల దీనిని దక్షిణ ఢిల్లీకి చెందిన పుంచల వంశస్థుడైన బభ్రవ్యుడు నూట యాభై అధ్యాయములకి సంగ్రహము చేసెను. ఈ నూట యాభై అధ్యాయములే ఏడు గ్రంథములుగ విభజించడమైనది.

సామాన్యాధికరణం

[మార్చు]

శాస్త్ర సంగ్రహం

[మార్చు]
  • ధర్మార్థకామాలకు ప్రమాణం చేసి, వాటిని ఉపదేశించిన ఆచార్యులకు నమస్కరించి సృష్టి గురించి ఇలా మొదలుపెడతాడు -
ప్రజాపతి మొట్టమొదట మానవులను సృష్టించాడు. వారి సుఖజీవనానికి సాధనమైన ధర్మార్థాలను గురించి ఒక శాస్త్రం ప్రవచించాడు. దాని పేరు స్థితి నిబంధనం. ఇది లక్ష అధ్యాయాలు గల పెద్ద గ్రంథం. స్థిత నిబంధనం లో స్వాయంభువ మనువు ధర్మశాస్త్రం రచించాడు. బృహస్పతి అర్థశాస్త్రాన్ని, నందీశ్వరుడు కామశాస్త్రాన్ని చెప్పాడు. కామశాస్త్రం వేయి అధ్యాయాల గ్రంథం.
  • శాస్త్ర సంగ్రహాన్ని ముగిస్తూ-
వాత్స్యాయన కామసూత్రాలు అనే గ్రంథం మొత్తం ముప్పై ఆరు అధ్యాయాలతోనూ, అరవై నాలుగు ప్రకరణాలతోనూ, ఏడు అధికరణాలతోనూ, సహస్రాధికమైన శ్లోకాలతోనూ అలరారుతున్నది.

త్రివర్గప్రతిపత్తి

[మార్చు]
  • తన నూరేళ్ళ జీవిత చక్రంలో మనిషి ధర్మార్థకామాలని సందర్భోచితంగా ఆచరించాలి. వీటి ఆచరణలో ఒక దానితో మరొకటి ఘర్షణ పడకుండా శ్రావ్యంగా ఉండాలి. బాల్యంలో విద్యనాచరించాలి. యౌవనంలో అర్థాన్ని, కామాన్ని పొందాలి. వృద్ధ వయసులో మోక్షం కొరకు ధర్మాన్ని ఆచరించాలి.
  • ధర్మాన్ని పవిత్ర శాసనాలనుండి గానీ, లేదా ధర్మనిపుణుల ద్వారా గానీ తెలుసుకోవాలి.
  • అర్థం అనగా కళలని, భూమిని, స్వర్ణాన్ని, పశువులని, పరికరాలని మరియు స్నేహితులని సంపాదించుకోవటం. వీటిని రక్షించుకోవటం, పెంపొందించుకోవటం కూడా. అర్థాన్ని రాజు వద్ద పని చేసే వారి నుండి, వాణిజ్య శాస్త్రంలో దిట్టలైన వ్యాపారవేత్తల నుండి నేర్చుకోవాలి.
  • కామం అనగా పంచేంద్రియాలతో బాటు తెలివిని మరియు ఆత్మని ఉపయోగించి ఆనందించునవి. ఆనందించబడు వస్తువుకి అనుభవించు ఇంద్రియముకి మధ్యన ఉన్న ప్రత్యేక సంబంధమే, అనుభవిస్తున్నామన్న ఆనందమే కామము. కామమును పౌరుల ఆచరించువిధానాల ద్వారా తెలుసుకోవాలి.
  • ధర్మార్థకామాలలో కామము కంటే అర్థము ప్రాముఖ్యత గలది. అర్థము కంటే ధర్మము ప్రాముఖ్యత గలది. రాజుకి అన్నింటికన్నా అర్థమే ముఖ్యము (పౌరుల జీవనోపాధి అదే కాబట్టి). వేశ్యలకి అన్నింటికన్నా కామమే ముఖ్యము (వారి జీవనోపాధి అదే కాబట్టి).

విద్యాసముద్దేశ:

[మార్చు]
  • కళలు, శాస్త్రాలతో బాటు పురుషులే కాక, స్త్రీలు కూడా పెళ్ళికి ముందే కామసూత్రములని అభ్యసించాలి. పతి అనుమతితో వివాహం తర్వాత కూడా వీటిని అభ్యసించాలి.
  • కొందరు విజ్ఞానవంతులు స్త్రీలు కామసూత్రములని అభ్యసించరాదని తెలిపిరి.
  • కానీ ఈ పద్ధతి సరియైనది కాదు. కామము గురించి, కామశాస్త్రపు ఆచారాల గురించి, కామసూత్రాల ఆచారాల గురించి స్త్రీలకి ఇప్పటికే తెలుసు. ఏ రంగం లోనైనా శాస్త్రోక్త పద్ధతులు కొందరికి మాత్రమే తెలియును. యజ్ఞం చేయువారికి వ్యాకరణము గానీ, అక్షరదోషముల గురించిగానీ తెలియకనే దేవతలని సంబోధిస్తున్నారు. జ్యోతిష్శాస్త్రము తెలియకనే సగటు మనిషి తన పనులకి మీనమేషాలని లెక్కపెడుతున్నాడు. పశు శిక్షణ గురించి తెలియకుండానే సైనికులు కేవలం సాధన ద్వారానే గజారోహణం, అశ్వారోహణం వంటివి చేస్తున్నారు. సుదూర ప్రాంత్రాలలో ఉన్న ప్రజలు కేవలం రాజు తమని రక్షిస్తాడనే నమ్మకముతోనే, మరే ఆలోచనలు లేకుండా, రాజాజ్ఞలని శిరసావహిస్తున్నారు. కేవలం స్వీయానుభవంతోనే కామ శాస్త్రం గురించి తెలుసుకొన్న కాంతలని రాకుమారీలు, మంత్రుల పుత్రికలు మరియు ఇతర సాధారణ స్త్రీలలో మనము చూడవచ్చును.

నాగరకవృత్తం

[మార్చు]
  • కేవలం సంస్కృతంలో మాత్రమే సంభాషించేవాడు కాకుండా (అంటే ఇతర భాషలు కూడా మాట్లాడేవాడు), యాసకు పరిమితం కాకుండా (అంటే అన్ని యాసల వారికీ అర్థమయ్యేలా) వివిధ సాంఘికాంశాల గురించి మాట్లాడే పౌరుడు చాలా గౌరవాన్ని పొందుతాడు. తెలివైనవారు జనామోదం లేని, నీతి-నియమాలు లేని సంఘాన్ని కోరుకోరు. ఇతరులని నాశనం చేసే యోచన వారికి కలుగదు. విద్యావంతుడైనవాడు పౌరుల అభీష్టాలని మన్నించే, పౌరుల సుఖశాంతులని కోరే సంఘంలో ఉన్నపుడు అతనిపై ఈ ప్రపంచంలో గౌరవం పెరుగుతుంది.

నాయకసహాయదూతీకర్మవిమర్శః

[మార్చు]
  • నిజాయితీపరుడైన, తెలివైన వాడు; మంచి స్నేహితుడు కలవాడు; ఇతరుల ఉద్దేశ్యాలని ఎరిగినవాడు; అన్నింటికీ సమయం, సందర్భం ఎరిగినవాడు; ఇతర ఏ విషయమైనా; ఎంతటి కష్టసాధ్యమైన స్త్రీనైనా సాధించగలడు.

సాంప్రయోగాధికరణం

[మార్చు]

రతావస్థాపన:

[మార్చు]
  • పురుషులతో సంభోగించటం ద్వారా స్త్రీలు తమ కామవాంఛలని తీర్చుకొంటారు. రమించునపుడు ఈ స్పృహ కలిగి ఉండే వారు ఆనందాన్ని పొందుతారు. ఇదే వారికి సంతృప్తి.
  • పురుషులలో వీర్యస్ఖలనం కేవలం సంభోగం యొక్క అంతిమ దశలో జరుగుతుంది. కానీ సంభోగం ఆసాంతమూ స్త్రీలలో స్ఖలిస్తూనే ఉంటుంది. ఇరువురిలో స్ఖలనాలు ఆగిపోగనే సంభోగ చర్యని వారు ఆపివేస్తారు.

ఆలింగనవిచారం

[మార్చు]
  • ఆసక్తి గొలిపే కౌగిలి గురించి పురుషులు ప్రశ్నించి, విని, మాటలాడి, తెలుసుకొని వారు సంతుష్టులయ్యే విధంగా సుఖిస్తారు. కామక్రీడలని ఆనందించే సమయంలో, వారి ప్రేమని, కామవాంఛని ఏ విధంగానైనా పెంపొందించగలిగేవి అయితే; కామ శాస్త్రాలలో ప్రస్తావించని కౌగిళ్ళని కూడా వారు అభ్యసించవలెను. శాస్త్రంలోని నీతి నియమాలు పురుషునిలో కోరిక ఒక స్థాయి వరకు ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తాయి. ప్రేమ అనే చక్రం ఒక్కసారి కదిలిందంటే, శాస్త్రమూ లేదు, పద్ధతీ లేదు.

మూలాలు

[మార్చు]
  1. http://www.sacred-texts.com/sex/kama/
  2. http://titus.uni-frankfurt.de/texte/etcs/ind/aind/klskt/kamasutr/kamas.htm