చర్చ:వాత్స్యాయనుడు

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

చర్చలకి ఆహ్వానం[మార్చు]

వికీసోర్స్ లో వీలైనంతవరకూ పూర్తి చేయబడిన కామసూత్రాలని విస్తరించే పని లో ఉన్నాను. వాటిలో ముఖ్యమైన అనువాదాలని ఇక్కడ చేర్చబోతున్నాను. ఈ పేజీని ఇంకనూ ఎలా అభివృద్ధి చేయవచ్చునో సూచించగలరు. ఉదా: సంస్కృతం నుండి తొలిసారిగా దీనిని అనువదించిన బ్రిటీషు దొర చిత్రపటాన్ని చేర్చాను.

  • సహజంగానే శృంగార భంగిమలకి సంబంధించిన చిత్రపటాలు కామన్స్ లో కోకొల్లలు గా పడి ఉన్నాయి. వీటి సంగతి అలా ఉంచితే, ధర్మముకి, అర్థముకి సంబంధించిన బొమ్మలు చేర్చవచ్చునా?
  • వాత్సాయనుడి చిత్రపటం?

ఇలా ఇంకా ఏమి చేయవచ్చు? సలహాలు, సూచనలకి ఇదే నా హృదయపూర్వక ఆహ్వానము! చర్చించగలరు. - Veera.sj (చర్చ) 08:34, 8 మార్చి 2015 (UTC)

శశి గారికి, ఇక్కడ వికీఖోట్ లో ఒక వ్యక్తికి గురించిన పేజీ ద్వారా అతడు/ఆమె చెప్పిన లేదా వ్యక్తపరిచిన విషయాలను తెలియజేయవచ్చును. లేదా ఒక విషయానికి పేజీని తయారుచేసి ఆ విషయం గురించి ఎవరెవరు ఏమేమి చెప్పారు అని తెలియజేయొచ్చు. అనగా నాకు అర్ధం అయినంత వరకు వాత్స్యాయనుడు లేదా వాత్స్యాయన మహర్షి (తెవికీ వ్యాసం) అనే పేజీకి ప్రస్తుత వ్యాసాన్ని దారిమార్పు చేయాలి. రిచర్డ్ బర్టన్ ను వేరుగా పేజీ కావాలంటే తయారుచేయండి. ఇంక విషయానికి వస్తే; పద్మిని అనే స్త్రీజాతికి ఒక పేజీని తయారుచేసి ఆ స్త్రీల లక్షణాలను వివరిస్తూ రచయిత వాత్స్యాయనుడి పేరును ఉటంకించండి. మంచి విషయాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 13:07, 9 మార్చి 2015 (UTC)