విజయనగర సామ్రాజ్యము
స్వరూపం
భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో హరిహర, బుక్కరాయలు అను ఇరువులు సోదరులు తుంగభద్ర తీరాన స్థాపించారు. ఈ సామ్రాజ్యాన్ని సంగమ, సాళ్వ, తుళ్వ, ఆర్వీటి అను నాలుగు వంశాలు పరిపాలించాయి. వీరిలో శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యుడు.
విజయనగర సామ్రాజ్యముపై వివిధ చరిత్రకారులు, చారిత్రక పర్యాటకుల వ్యాఖ్యలు:
- రోం నగరమంత పెద్దదిగాను, సుమ్దరమైనది గాను నాకు విజయనగరం కనిపించింది.
- చారిత్రిక పర్యాటకుడు పేస్ ప్రకటించించిన వ్యాఖ్య (ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఏటుకూరి బలరామమూర్తి రచన, పేజీ 174)
- విజయనగరం కేవలం రాజ్యం కాదు, సామ్రాజ్యం.
- విజయనగరాన్ని పర్యటించిన పోర్చుగీసు పర్యాటకుడు న్యూనిజ్ వ్యాఖ్య (ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఏటుకూరి బలరామమూర్తి రచన, పేజీ 172).
- ఈ రాజుల వద్ద 10లక్షల సైన్యం ఉంది. ఏ క్షణంలోనైనా ఈ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది.
- పోర్చుగీసు పర్యాటకుడు పేస్ వ్యాఖ్య.
- విజయనగరము వంటి పట్టణము ప్రపంచమున మరియొకటి వున్నదని చూడలే, విని యుండలేదు.
- విజయనగరము నంతటిని ఒక్క ప్రదేశమునుండి చూడలేము. కనుక నేనొక కొండ నెక్కి చూచాను. నాకు కనబడినంత నగర భాగమే మన రోం నగరమంత యున్నది.
- విజయ నగరము జనాబ గురించి నేను చెప్పను. చెప్పితే అదేదో కట్టు కథ అని అనుకుంటారు.
- విజయనగరము ప్రపంచంలోనే అత్యంత స్వయం సంవృద్ది గల పట్టణము.
- విజయనగర రాజులు ఎంత సైన్యం కావాలంటే అంత సైన్యం సమకూర్చగలరు.
- విజయనగరములో అనేక పండ్ల తోటలు, పంటలు వున్నందున అంతా కలిసి ఒక అరణ్యంలాగ కనబడుతున్నది.
- పోర్చుగీసు పర్యాటకుడు న్యూనిజ్ వ్యాఖ్య.
- సప్త ప్రాకారములచే చుట్టబడిన 7 దుర్గములు ఈ నగరములో ఉన్నవి.
- అచ్యుత రాయల కాలంలో విజయనగర రాజ్యంలో వంట పాత్రలు అన్ని బంగారంతో చేసినవి. ఒక్కొక్క పాత్ర ఎంత పెద్దందంటే the vessels ara such a big that one could cook half a cow in each ....
- విజయనగరాన్ని పర్యటించిన అబ్దుల్ రజాక్ వ్యాఖ్య.