వి.రాజా రామ్మోహనరావు

వికీవ్యాఖ్య నుండి

వి.రాజా రామ్మోహనరావు ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఆయన రచించిన ప్రముఖ నవల మరో ప్రవాహం. ఇందులో నుంచి కొన్ని వ్యాఖ్యలు...

రామ్మోహనరావు వ్యాఖ్యలు[మార్చు]

జీవితం(బతుకు) గురించి...
  • బతుకులో ఉన్నది పొగొట్టుకోవడం ఓ బాధ-పొగొట్టుకున్నది గుర్తు రావడం మరో బాధ.
  • ఎంత నికృష్టపు బతుక్కైనా ప్రతి బతుక్కూ అపురూపమైనవై కొన్ని ఉంటాయి.
  • ప్రతి మనిషి జీవితంలో నిలబడటానికి ఆలోచన, శ్రమ అవసరం.
  • ఇతరుల మీద ఆధారపడి జీవించడం పెద్ద దరిద్రం.
  • ఎంతటి పనికిరాని బతుక్కేనా ఎగసిపడే గుండె ఉంటుంది. అన్యాయానికి ఆవేశపడే మనసు ఉంటుందని చాలా మందికి తెలియదు.
  • ఎవరి బతుక్కైనా సలహా ఇవ్వటానికి గొప్ప విజ్ఞానం కన్నా అనుభవం, సరైన దృష్టి ముఖ్యం.
  • ఎంతగానో దిగజారిన బతుకు భయంకరమైన మొండితనాన్నే కాదు, దానికన్న అసహ్యకరమైన మొరటుతనాన్ని ఇస్తుంది.
  • తమ బతుకుల బాధల వెనుకాల ఉన్న ఆర్థిక, రాజకీయ, సాంఘిక వలయాల శక్తి చాలా మందికి తెలియకపోయినా, ఏదో శక్తి తాలూకు ఒత్తిడి తమ బతుకుల మీద ఉందని ఇంచుమించు ప్రతి బడుగు బతుక్కూ తెలుసు.

ఇవీ చూడండి[మార్చు]