Jump to content

వేమూరి శారదాంబ

వికీవ్యాఖ్య నుండి

వేమూరి శారదాంబ, (1881 మే 3 - 1899 డిసెంబరు 26) - 19వ శతాభ్ధములో పిన్న వయసు లోనే సంస్కృతాంద్రములనభ్యసించి, సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యత సాధించిన మహిళ వేమూరి (దాసు) శారదాంబ. ఈమె విద్యా విహీనులుగా ఉన్న సాటిమహిళల దుర్భరస్థితిగతులను వెలిబుచ్చి, స్త్రీలకువిద్యాబోధన అవసరమని ఉద్యమం ఆరంభించి, అభ్యుదయ ధృక్పదముతో రచనలు చేసింది. అంతేగాక సంగీత సాహిత్యాలలో బాల్యములోనే అతీతమైన ప్రవీణ్యత సాధించింది. ఆమె తన 19వ ఏటనే పిన్నవయసులో మరణించింది.

వేమూరి శారదాంబ

వ్యాఖ్యలు[మార్చు]

మాధవశతకము[1]

  • నిన్ను మదిం దలంచి యిటు నిచ్చలు వేండు టదేలయన్న| స త్సన్నుత! స్త్రీల దుస్థితిని సద్విదితంబుగ బాపి యిభ్ళువిన్‌| బన్నుగ సద్భుధుల్‌ తగిన పట్టున విద్యను ముద్దరాండ్రకున్‌|(గన్నన నేరిపించి మరి జ్ఞానము బుట్టగం జేయు మాధవా
  • పురుషు లదేలకో యిపుడు పూర్వపు స్త్రీల బలెన్‌ స్వకీయలౌ | తరుణుల విద్యనేర్చి నిరతంబును వారికి మంచిబుద్దులన్‌ | గరపక వారి దుస్థితికి గారణమైనను జూడకుండగా | సరగున వారి దుర్గతిని జక్కగం దీర్చ వదేమి మాధవా
  • ఇంతులు ప్రొద్దువోక పొరుగిండ్లను దిన్నెలగూరుచుండి యా వంతయు నేరకుండి ననువాదము జేయుచునుండ్రు శుష్క వే దాంత విమర్శ లెప్పుడు నదట్టుల గాకను దీరికైనచోం గాంతలు చక్కగా జదివి గ్రాహ్యము సేయుట మేలు మాధవా

వేమూరి శారదాంబ గురించి[మార్చు]

కాత్యాయనీ విద్మహే[2]

  • తెలుగునాట సంస్మరణోద్యమం, ప్రత్యేకించి స్త్రీ విద్యా ఉద్యమం స్త్రీలలో మేలుకొల్పిన చైతన్యం వాళ్ళను మహిళా ఉద్యమ నిర్మాతలను చేసింది. ఉద్యమ ఆశయాల ప్రచారానికి వారిని రచయితలుగా మలిచింది. కొటికలపూడి సీతమ్మ, భండారు అచ్చమాంబ ఆ కోవలోని వారే. వారివలె సామాజిక జీవితం, కార్యాచరణ లేకపోయినా తనకున్న పరిమితులలో సాంస్కృతిక భావజాల రంగంలో స్త్రీ విద్యకు ఒక అనుకూల వాతావరణాన్ని నిర్మించటానికి పనిచేసిన చరిత్రకెక్కని మహిళ వేమూరి శారదాంబ.
  • శారదాంబ దృష్టిలో విద్య అంటే అక్షరాస్య విద్య. స్త్రీలను రోకటి పాటలు పాడుకొనే స్థితి నుండి రామాయణ భారతాది పురాణ కథలను గ్రంథ పరిశీలన చేత అర్ధం తెలిసి చదువుకునే దశకు చేర్చే విద్య (33). బాల చికిత్స, చరిత్ర, భూగోళ సమాచారం, లెక్కలు, దేశ భాషలో చక్కగా రాయగల నైపుణ్యం స్త్రీ విద్యకు ఆమె ఇచ్చిన సిలబస్‌ (57). సంగీత నాట్య చిత్రలేఖనాది లలితకళలు కూడా స్త్రీలు నేర్వవలసినవే అన్నది ఆమె అభిప్రాయం.
  • అయితే శారదాంబ దృష్టిలో జ్ఞానం జ్ఞానం కోసం కాదు. జ్ఞానం సకల మేధో శక్తుల వికాసనానికి, ఆవిష్కరణకు, మహిళల చదువుకు సమాజంలో ఒక ఆమోదాన్ని సంపాదించటానికి చరిత్ర నుండి, పురాణాలనుండి ఉదాహరణలుగా తెచ్చి చూపిన లీలావతి వంటి శాస్త్రవేత్తలు, దేవహూతి వంటి వేదవేత్తలు, మొల్ల, తరిగొండ వెంగమాంబ వంటి కవులు, కైక, సత్య వంటి యుద్ధ వీరులు - బహు ముఖీనమైన శక్తి సామర్థ్యాలు చూపగల స్త్రీల అస్తిత గురించిన శారదాంబ ఆత్మ గౌరవ చేతనకు ప్రబల సాక్షులు.

మూలాలు[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. వేమూరి శారదాంబ. మాధవశతకము.1901. https://archive.org/details/madhavasatakamu/page/34/mode/1up
  2. కాత్యాయనీ విద్మహే. ముందుమాట.వేమూరి శారదాంబ. మాధవశతకము.1901. https://archive.org/details/madhavasatakamu/page/34/mode/1up