Jump to content

శివానందమూర్తి

వికీవ్యాఖ్య నుండి

శివానందమూర్తి సుప్రసిద్ధులైన కందుకూరి శివానంద మూర్తి (డిసెంబరు 20, 1928 - జూన్ 10, 2015) సుప్రసిధ్ద ఆధ్యాత్మికవేత్త, తత్త్వవేత్త, పండితుడు, మానవతావాది. భీమిలిలో శివానంద ఆశ్రమం ద్వారా నైతికత, ఆధ్యాత్మికత ప్రచారం చేస్తున్నారు. సరళమైన జీవనం, సమున్నతమైన వ్యక్తిత్వం సాధించమని బోధిస్తూంటారు.

వ్యాఖ్యలు

[మార్చు]
  • పాపం అంటే, భౌతికంగా ఎవరికో అపకారం చేయటం మాత్రమేకాదు. మన అతి విలాసవంతమైన జీవన విధానానికీ, మనచుట్టూ సమాజంలోని అతి పేదరికానికీ మధ్య పెరిగిపోతున్న వ్యత్యాసమే పాపకారణమౌతోంది.[1]
  • నాలుగు హత్యానేరాలతో, పది దోపిడీ నేరాలతో ఉన్న వ్యక్తి ఏ అడ్డంకి లేకుండా ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి వెళ్లవచ్చు. మరోపక్క ఒక చిన్న ప్రభుత్వోద్యోగానికైనా ఏ చిన్న నేరారోపణా ఉన్న వ్యక్తి కూడా ఎంపిక కావడం సాధ్యంకాదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితి! ఈ వ్యవస్థలు సరిదిద్దే విధానంకాని, ఒక శాసనం కాని నేడు లేనూలేదు. అది వచ్చే ఆశా, అవకాశమూ కూడా లేవు.[2]
  • ధర్మాచరణ పరోపకారం కాదు. తనకి పనికొచ్చే వివేకమే.[3]

మూలాలు

[మార్చు]
  1. సంపాదకీయం:వల్లూరి విజయ హనుమంతరావు:సుపథ ద్వైమాసిక పత్రిక:జూన్ 2011
  2. భారతీయత:శివానందమూర్తి:సుపథ ద్వైమాసిక పత్రిక:జూన్ 2011:పేజీ.11
  3. ధర్మం కథ:శివానందమూర్తి:సుపథ సాంస్కృతిక పత్రిక:జూన్ 2013:పేజీ.15
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.