శ్రీనిధి శెట్టి
శ్రీనిధి శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె మొదటి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకొని 2018లో కె.జి.యఫ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[1] 1991 అక్టోబరు 21న బంట్ కమ్యూనిటీకి చెందిన తులువర్స్ మంగళూరు కుటుంబంలో శ్రీనిధి రమేష్ శెట్టి జన్మించింది.[2] ఆమె తండ్రి రమేష్ శెట్టి ముల్కి పట్టణానికి చెందినవాడు, తల్లి కుశల తల్లిపాడి గుత్తు, కిన్నిగోలికి చెందినది.[3] ఆమె శ్రీ నారాయణ గురు ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో చదువుకుంది, తర్వాత సెయింట్ అలోసియస్ ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు చదివింది. ఆమె బెంగుళూరులోని జైన్ యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీని పొందింది. ఈ డిగ్రీ డిటింక్షన్‌తో పట్టభద్రురాలైంది.[4]
వ్యాఖ్యలు
[మార్చు]- నేను చిన్నప్పుడు చాల కలలు కనేదానిని . మా అమ్మానాన్నలు నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించారు.
- మిస్ సుప్రానేషనల్ లోని జడ్జీలు నా గురించి ఏం ఇష్టపడ్డారని అడిగితే అది నా వినయం అని చెబుతాను.[5]
- ప్రతి సినిమా ప్రత్యేకమైనది కాబట్టి భవిష్యత్తులో నేను ఎంచుకునే ప్రాజెక్టులతో 'కేజీఎఫ్'ను పోల్చను. కాబట్టి నేను ఎలాంటి ఒత్తిడికి లోనుకాను.
- నాకు సినిమా గురించి, నటన గురించి పెద్దగా తెలియదు.
- మొదట్లో షోబిజ్ గురించి ఆలోచించకపోయినా టీవీలో కనిపించి సెలబ్రిటీ కావాలని కలలు కన్నాను.
- నేను చాలా తింటాను, కానీ మరింత ఎక్కువ వ్యాయామం చేస్తాను.
- నాకు ఎప్పుడూ సినిమాలు, పోటీలు చూడటం అంటే చాలా ఇష్టం. నేను పెద్దయ్యాక, నా కలలు లక్ష్యాలుగా మారాయి, నేను ఆ దిశగా పనిచేయడం ప్రారంభించాను. నేను ఒకేసారి ఒక అడుగు వేశాను, అదృష్టవశాత్తూ, పరిస్థితులు నాకు అనుకూలంగా పనిచేశాయి.
- ఓహ్! నేను భోజన ప్రియురాలుని. నేను ఆహార దేవతను అనుకుంటాను. నా నిద్రలో కూడా మీరు నన్ను లేపి ఆహారం ఉందని చెబితే, నేను లేచి తింటాను.
- నేను ముంబైలో పుట్టాను, మంగళూరులో జంతువులతో వ్యవసాయ క్షేత్రం ఉన్న మా అమ్మమ్మ ఇంట్లో పెరిగాను.