సమస్యా పూరణం:

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

తెలుగు భాషలో అష్టావదానము అనేది ఒక అద్బుత ప్రక్రియ. అందులోని ఎనిమిది అంశాలు దేని కదే గొప్పది. అందులో సమస్యా పూరణము అనే ప్రక్రియ మరింత జటిలంగా తోస్తుంది ప్రేక్షకులకు. కానీ అవధాని ఆ క్లిష్ణ సమస్యను అవలీలగా చేదింది ప్రేక్షకులను విస్మయంలో ముంచెత్తుతారు. అసమంజస మైన ఒక పద్య పాదాన్ని సమస్యగా ఇస్తారు అవదానిగారికి. దానిని సవ్యంగా పూరించి పద్య రూపంలోనే పరిష్కరిస్తారు. ఈ కార్యక్రమము ఆహ్లాదాన్నే గాక విజ్ఞానాన్ని కూడ ఇస్తుంది ప్రేక్షకులకు. అటువంటి కొన్ని సమస్యా పూరణలను ఈ క్రింద కనబరచడమైనది. అవదామంటే సాహితీ విన్యాసమే.


1. సమస్యగా ఇచ్చిన ఒక పద్య పాదము: సవతి లేని యింత సౌరు లేదు. (సౌరు = అందం)

అవదాని డా: పోలేపెద్ది రాధా కృష్ణ మూర్తి ఈ సమస్యను ఎంత చాక చక్యంతో పూరించారో చూడండి:

ధన మదెంత గలిగినను, నాల్గు మోముల
వాని భార్య లేని వాని యింట
విద్య యెంత గలిగి వెలిగిన, భూదేవి
సవతి లేని యింట సౌరు లేదు

మనిషికి కేవలం ధనం మాత్రమే వుంటే సరి పోదు, అలాగే విద్య మాత్రమే వుంటే కూడ సరిపోదు ....... ఆ రెండూ వుండాలనే అర్థంతో సవతి అనే పదానికి ముందు భూదేవి అనే పదం చేర్చి .... గమ్మత్తుగా సమస్యా పూరణ గావించారు అవదాని గారు. భూదేవి సవతి అనగా లక్ష్మీ దేవి అనీ... అనగా ధనము అని అర్థం గదా.....

2.సమస్య: జిహ్యికకు పంచదారయు చేదు గాదె? . పంచదార తియ్యగా వుంటుందనేది లోక న్యాయము. తద్విరుద్దంగా పంచ దార చేదుగా నుంటుంది అని సమస్య నిచ్చారు వృచ్ఛకులు ఒక అవదానిగారికి. అవదాని మోదుకూరు రాధాకృష్ణ శర్మ గారు ఈ సమస్యను ఎలా పూరించారో చూడండి.

రావణా వేగ సీతను రాము జేర్చి
శరణు వేడు మనిన విభీషుణుని సూక్తు
లాలకించెనె? గరళమ్ము నారగించు
జిహ్యికకు పంచ దారయు చేదు గాదె|

3. సమస్య: పతి యే భర్తకు రక్షకుండని మదిన్ పద్మాక్షి ప్రార్థించెడిన్. ఇక్కడ పతి -- భర్త రెండు సమానార్థాలు. అలాంటప్పుడు పతిని భర్థ రక్షించడం ఎలా సాద్యం. కాని అవథాని రామరసం శర్మ ఆ సమస్యను ఎలా సుసాద్యం చేశారో చూడండి.

పతిన్ గానక పార్వతీ సతి, తగన్ పద్నాల్గు లోకమ్ములన్
వెతతో చూడగ, కానుపించె కడకున్ వీరుండు గాజాఅరునున్
అతిదై గర్బమునందు ; కుందుచును, తానాపేక్షతో దల్చె శ్రీ
పతియే భర్కకు రక్షకుండని మదిన్ పద్మాక్షి ప్రార్థించెడిన్:

దీనికి పూర్వ పురాణ కథ తెలియాలి. అదేమంటే ....... గజాసురుడనే రాక్షసుడు తన తపస్సు తో శివుని మెప్పించి అతనిని తన ఉదరములో వుండేటట్లు వరం పొందుతాడు. పార్వతి శివుని గురించి ముల్లోకాలు వెతికి చివరి గజాజురుని గర్బంలో వున్నాడని తెలుసుకొని అతన్ని రక్షించాలంటే శ్రీ పతి యైన విష్ణువే సమర్థుడని తలచి అతన్ని వేడుకుంటుంది. అలా పతి కు ముందు శ్రీ చేర్చి యుక్తిగా సమస్యను పూరించాడు అవదాని.

4. సమస్య: రంబను బెండ్లి యాడె గద.... రాముడు లోకము పొంగి పోవగన్.. ; ఏక పత్నీ వ్రతుడైన శ్రీరాముడు రంబను పెండ్లాడట మేమిటి? దాంతో లోకము ఆనందంతో పొంగి పోవడేమిటి? ఇది లోక విరుద్ధము. ఈ వింత సమస్యను పోలే పెద్ది రాధాకృష్ణమూర్తి ఎంత చమత్కారంగా పూరించాడో చూడండి.

దంబ యుతుండు రావణుడు దర్సితుడై చెలరేగె, వాని సం
రంభము బావవ, వేగమే ధరాతల మందున బుట్టి, జానకిన్
శుంభ దనేక సద్గుణ యశో నికురంబ, సమేయ సత్క్రియా
రంబను బెండ్లి యాడె గద... రాముడు లోకము పొంగి పోవగన్.

ఈ లోక విరుద్ధమైన సమస్యను పూరించ డానికి అవధాని గారు రంబ అనే మాటకు ముందు సత్క్రియా అనే పదాన్ని చేర్చి సత్క్రియారంబను అని విడగొట్టాడు. తర్వాత విషయము రాముడు సీతను పెండ్లి యాడడము లోకము పొంగి పోవడము మామూలు విషయాలె. అలా అవదాని తెలివిగా సమస్యను పూరించి లోక విరుద్ధమైన సమస్యను సాధారణ విషయంగా మార్చి వేశారు.

5.ఏప్రిల్ తొమ్మిది 1972 వ సంవత్సరంలో సూర్యా పేటలో వారు చేసిన అస్టావధానంలో దూపాటి సంపత్కుమారాచార్య' గారికిచ్చిన సమస్య దానిని అవధానిగారు పూరించిన విధానము చూడండి: ...... ఇచ్చిన సమస్య లంజల కాలు చూచు నెడలం గలుగుంగద మోక్ష సంపదల్ అనగా వేశ్యల కాలు చూడడం వలన మోక్షం సిద్దిస్తుందని అర్థం. దీనికి వారు పూరుంచిన సమాదానము : <poem>

ఉ|| క్రొంజిగురాకు దేహములకుం బరి ధానము లూడ్చి మాన పె ట్టంజను గోపికాళికి తటాలున కృష్ణుడు నిల్చె ముందు మే నం జనియించు లజ్జ యమునా నది దూకిన నాటి సాంధ్య వే ళంజలకాలు చూచు నెడలం గలుగలుగుంగద మోక్ష సంపదల్