సహాయం:Contents
స్వరూపం
వికీవ్యాఖ్య - సహాయం
[మార్చు]సూచనలు
[మార్చు]ఈ ప్రాజెక్ట్ లో వ్యక్తులు / విషయాలకు సంబంధించి వ్యాఖ్యలు అంటే కొటేషన్లు (Quotations) చేర్చవచ్చు. ఇంకా సామెతలు, జాతీయాలు కూడా చేర్చవచ్చు. పద్యాలు, పాటలు కూడా చేర్చవచ్చు, అయితే పూర్తి పాటలు/పద్యాలు చేర్చకూడదు . ఎంపిక చేసిన కొన్ని పంక్తులు మాత్రమే చేర్చాలి. కృత్రిమ మేధ ఉపకరణాల ద్వారా రూపొందించిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ చేర్చకూడదు.
- ఆధారాలు చేర్చడం మంచి పధ్ధతి.
ఒక వ్యక్తికీ లేదా ఒక విషయానికి సంబంధించి ఒకే పేజీ ఉంటుంది. కాబట్టి పేజీ సృష్టించేటప్పుడు వికీవ్యాఖ్యలో ఇదివరకే ఆ వ్యక్తికీ / విషయానికి పేజీ ఉందా లేదా చూడండి.
- పేజీ ఇదివరకే ఉంటే మీరు ఎంపిక చేసిన వ్యాఖ్యను చేర్చండి. లేకపోతేనే సృష్టించండి.
కొత్త పేజీ సృష్టించేటప్పుడు తెలుగు వికీపీడియాలో ఆ వ్యక్తికీ / విషయానికి పేజీ లేదా వ్యాసం ఉందేమో వెతకండి. ఉంటే అదేపేరుతో ఇక్కడ సృష్టించండి. ఈ పద్ధతివలన -
- తెలుగు వికీపీడియా నుంచి వ్యక్తి / విషయం గురించిన సంక్షిప్త సమాచారం, బొమ్మ వికీవ్యాఖ్య పేజీలో చేర్చడానికి వీలవుతుంది.
- తెలుగు వికీపీడియా వ్యాసానికి, వికీవ్యాఖ్య పేజీకి లింక్ చేయడానికి వీలవుతుంది.
వికీవ్యాఖ్య పేజీ ముఖ్యఅంశాలు
[మార్చు]- వ్యక్తికీ / విషయానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం:
- తెలుగు వికీపీడియా వ్యాసం నుంచి గ్రహించవచ్చు లేదా ఆంగ్ల వికీపీడియా వ్యాసం నుంచి అనువదించి తీసుకోవచ్చు
- వ్యక్తికీ / విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు అంటే కొటేషన్లు(Quotations)
- ఆధారాలు చేర్చడం మంచి పధ్ధతి
- ఆ వ్యక్తికీ సంబంధించి ఇతరులు చేసిన వ్యాఖ్యలు:
- ఆధారాలు చేర్చడం మంచి పధ్ధతి
- ఛాయాచిత్రం:
- వికీపీడియా వ్యాసం నుంచి పబ్లిక్ డొమైన్ లైసెన్స్ ఛాయాచిత్రాలు తీసుకోవచ్చు. వికీమీడియా కామన్స్ నుంచి తీసుకోవచ్చు.
- వర్గాలు:
- వర్గం అంటే ఒకే రకమైన విషయానికి సంబంధించిన వ్యక్తులు / విషయాలు ఒక తరగతిలో చేర్చాలి. ఉదాహరణకి - 'తెలుగు రచయితలు' ఒక వర్గం. ఆంగ్ల రచయితలు వేరొక వర్గం. వ్యాఖ్య పేజీని సముచితమైన వర్గంలో చేర్చాలి.
- వికీపీడియా వ్యాసంతో లింకు:
- వికీవ్యాఖ్య పేజీ చివరలో ఈ మూస ఉంచాలి. {{Wikipedia}}
- వికీపీడియా వ్యాసంలో వికీవ్యాఖ్యకు లింకు:
- సంబంధిత వికీపీడియా వ్యాసం తెరచి (సవరింపులో) పేజీ చివరలో ఈ మూసను చేర్చాలి {{వికీవ్యాఖ్య}}
- వికీడేటాతో లింకు:
- చివరగా వికీవ్యాఖ్య పేజీని వికీడేటాతోకూడా లింకు చేయాలి. పేజీ కి కుడివైపున ఉన్న పరికరాల జాబితాలో వికీడేటా లింకు లేకపోతే సంబంధిత వికీపీడియా వ్యాసంలో ఈ వికీడేటా లింకును కనుగొని వికీడేటా పేజీని తెరచి వికీవ్యాఖ్య అంశాన్ని చేర్చాలి.
సూచన:
[మార్చు]- ఇంకా తెలుసుకోవాలంటే వనరులు, మార్గదర్శకాలు చూడండి.
- సందేహాలు చర్చా పేజీలో రాయండి. శిక్షణ కొరకు ఈమెయిల్ లో సంప్రదించండి - email: tewikibadi@gmail.com