చంద్రశేఖర వేంకట రామన్
స్వరూపం
(సి.వి.రామన్ నుండి మళ్ళించబడింది)
భారతరత్న సర్ చంద్రశేఖర వేంకట రామన్ (ఆంగ్లం : Chandrasekhara Venkata Raman), రాయల్ సొసైటీ సభ్యుడు, (తమిళం : சந்திரேசகர ெவங்கடராமன் ) (7 నవంబరు 1888 – 21 నవంబరు 1970) భారతీయ భౌతిక శాస్త్రవేత్త అయిన ఇతడు తన మాలుక్యులర్ స్కాటరింగ్ మీద( తరువాత రామన్ ఎఫెక్ట్ గా ప్రసిద్దిచెందింది) చేసిన పరిశోధనలకు నోబెల్ పురస్కారాన్ని 1930 లో స్వీకరించాడు.
సి.వి.రామన్ యొక్క ముఖ్య ప్రవచనాలు
[మార్చు]- నా మతం విజ్ఞానశాస్త్రమే (సైన్స్). జీవితాంతం నేను దానినే ఆరాధిస్తాను.
- ప్రతి గొప్ప ఆవిష్కరణా ఒక ఆలోచనగానే మొదలవుతుంది.ఆ ఆలోచనని మరింత లోతుగా తరచి చూడాలన్న తపనే ఆవిష్కరణకు దారితీస్తుంది. ప్రపంచం సందేహించినా తమ మీద, తాము నమ్మిన ఆలోచన మీద ... నమ్మకం ఉన్నవారే నిజమైన సైంటిస్టులు.[1]
- నా వైఫల్యానికి నేనే యజమానిని. నేను ఎప్పుడూ విఫలం కాకపోతే, నేను ఎలా నేర్చుకోగలను?
- ఒక దేశం యొక్క నిజమైన సంపద నిల్వచేసిన బంగారంలో కాదు, ఆ ప్రజల మేధో, శారీరక బలాల్లోనే ఉంటుంది.
- పిల్లలకు సైన్స్‌ను విదేశీ భాషలో బోధించడం అసహజమైనది మరియు అనైతికమైనది అని నేను భావిస్తున్నాను. వారికి వాస్తవాలు తెలుస్తాయి, కానీ వారు దాని స్ఫూర్తిని కోల్పోతారు.
- మాతృభాషలో శాస్త్రాన్ని బోధించాలి. లేకపోతే, శాస్త్రం ఒక పైశాచిక కళగా మారుతుంది[2]
- పిల్లలకు సైన్సును విదేశీ భాషలో నేర్పడం అసహజమే కాదు, వారికి తీవ్ర అన్యాయం చేసినట్లు కూడా. దానివాళ్ళ వాళ్ళు ఫ్యాక్ట్స్ ని బట్టీ పెట్టగలరు కానీ విషయంలో ఆత్మను అర్ధం చేసుకోలేరు. మన శాస్త్ర పరిశోధన అభివృద్ధికి అది పెద్ద అవరోధం. [3]
