సి కె ప్రహలాద్
Appearance
కోయంబత్తూరు కృష్ణారావు ప్రహలాద్ (Kannada:ಕೋಯಮ್ಬತುರೆ ಕೃಷ್ಣರಾವ್ ಪ್ರಹಲಾದ್) (8 ఆగష్టు 1941 – 16 April 2010) మిచిగాన్ విశ్వవిద్యాలయంలో నిర్వహణా ఆచార్యులు.
- రైలు స్టేషనుని దాటి పోయినది
- మూలం: Despite Widespread Poverty, a Consumer Class Emerges in India[dead link], New York Times
- పేదలని బాధితులుగా, లేదా భారంగా చూడటం కంటే స్థితిస్థాపక, సృజనాత్మక వ్యవస్థాపకులుగా మరియు (డబ్బు) విలువ తెలిసిన వినియోగదారులుగా వారిని గుర్తిస్తే, అవకాశం గల ఒక సరికొత్త ప్రపంచానికి తెర లేస్తుంది.
- మూలం: The Fortune at the Bottom of the Pyramid: Eradicating Poverty Through Profits. ISBN 0131467506.
- ఉద్భవిస్తున్న విపణులని బహళ జాతీయ సంస్థలు శాశ్వతంగా మార్చి వేస్తాయి. అలాగే బహుళ జాతీయ సంస్థలు ఉద్భవిస్తున్న విపణులని శాశ్వతంగా మార్చి వేస్తాయి.
- దారిద్ర్య, లేముల నిర్మూలన 2020 కల్లా సాధ్యపడుతుంది అనడంలో నాకెటువంటి సందేహమూ లేదు.
- నేనెంత పెట్టుబడి పెట్టగలననేది ప్రశ్న కాదు, నేనెంత తొందరగా నేర్చుకోగలననదే ప్రశ్న.
- ఆవిష్కరణకి వేగం మరియు సత్తువలతో బాటు దిశలో స్పష్టత కూడా అవసరమౌతాయి.
- ఇప్పటి వినియోగదారులు వాస్తవానికి వారికి అందే విలువలని సృష్టించటంలో చురుగ్గా పాల్గొనేవారు.
- నీ పూర్వీకులు చేసిన దానికి గౌరవాన్ని ఆశించవద్దు.
- ఉద్యోగులు నిరోధించబడేది వనరుల లేమి వలన కాదు, వారి ఆలోచనల వలన.
- నువ్వు బాగున్నప్పుడు అందరూ నీతో బాగుంటారు, నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు నీతో బాగున్నవారిని మరిచిపోకు.
- మన ఆలోచనలో స్పష్టత ఉన్న ప్రతిసారి, అమలు వెనుక నిజమైన ప్రయత్నం ఉన్న ప్రతిసారి, సఫలీకృతులమౌతామని భారతదేశం నిరూపించినది.
- మనం ఎలా ప్రశ్నిస్తున్నామన్నది సమాధాన శోధనలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది.
- ఫలితాలని ఎలా సాధిస్తావన్నదే నీ వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుంది.
- విజయంలో నమ్రత, ఓటమిలో ధైర్యాలే మంచి నాయకుడి ముఖ్య లక్షణాలు.
- తయారీ రంగంలో తెలివైన అంశాలని చేర్చి ఉత్పత్తి ప్రామణికత యొక్క అర్థాన్ని భారతదేశం పునర్లిఖించనుందని నేను నమ్ముతున్నాను.
- నువ్వు 100 శాతం శ్రమిస్తే, 200 శాతం ఫలితాన్ని ఆనందించగలవు.
- నీ ఆశయాలు నీ వద్ద ఉన్న వనరులని మించకపోతే, నువ్వు వ్యవస్థాపకుడివి కాలేవు.
- భారతదేశం, ఈ ప్రపంచానికి ప్రయోగశాల.
- 1817లో ప్రపంచ వర్తకంలో భారతదేశపు వాటా 30%. ఇంతకు మునుపు మనం సాధించినదాన్నే మనం మరచిపోతూ ఉంటాం.
- ప్రస్తుతం ఏం చేయవచ్చో ఏం చేయకూడదో నిర్ధారించేది వినియోగదారుడే.
- ప్రజలు న్యాయబద్ధతని కోరుకొంటారు, సహాయాన్ని కాదు.
- జీవితం గురించి నీ కంటే పేద ప్రజలకి బాగా తెలుసు.
- సామాజిక న్యాయం అంటే సమాజవాదం కాదు.
- పేదరికానికి విరుగుడు, పేద ప్రజల నిర్వహణ.
- భారతదేశంలోని సంక్షోభం నాయకత్వ లేమి అనే సంక్షోభమే.
- పేదవారిని తమ వినియోగదారులుగా పరిగణించిన సంస్థలకే భవిష్యత్తు ఉన్నది.
- పేదరిక సమస్య ఐనా మనల్ని ఆవిష్కరించేందుకు బలవంతపెట్టాలి.
- ఈ ప్రపంచం నీ విపణి అయినప్పుడు, నీ ఊహలని భారతదేశానికి మాత్రం ఎందుకు పరిమితం చేస్తావు?
- నియమాలని ఉల్లంఘించవచ్చు, బాధ్యతలని కాదు.
- భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోలేనిదే నువ్వు నాయకత్వం వహించలేవు.
- ఏదైనా నేర్చుకొనే ముందు, మరచిపోవాలి.
- నీ అభిరుచులతోనే నువ్వు ముందుకెళ్ళాలి; లేకపోతే, 30 ఏళ్ళ తర్వాత వెనక్కి చూస్కొని నిన్ను నువ్వు క్షమించుకోలేవు.
- ఒక కొత్త భారతదేశాన్ని నిర్మించాలి అంటే, ఒక కొత్త భారతదేశాన్ని నువ్వు ఊహించుకోవాలి.
- నీ తెలివితేటల ప్రదర్శన కంటే, నిజాయితీగా ఇతరులకు సహాయపడాలనుకొంటే, అన్నీ చాలా తేలికగా జరిగిపోతాయి.
మూలాలు
[మార్చు]- http://yourstory.com/2014/06/tips-for-consumer-india/
- http://www.goodreads.com/work/quotes/62368-the-fortune-at-the-bottom-of-the-pyramid-eradicating-poverty-through-pr
- http://www.business-strategy-innovation.com/2009/05/top-10-ck-prahalad-insights-world.html
- http://yourstory.com/2015/05/35-quotes-from-c-k-prahalad/
- http://www.toolshero.com/c-k-prahalad/