సురవరం ప్రతాపరెడ్డి
Jump to navigation
Jump to search
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28,1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం[2]
ప్రతాపరెడ్డి వ్యాఖ్యలు[మార్చు]
ప్రతాపరెడ్డిపై వ్యాఖ్యలు[మార్చు]
- పాత్రికేయుడో!అతడు,రాజకీయ దురంధరుడో!పండితుడో! వ్యాఖ్యతయో! అన్నీ ఒకటైనవాడో!
- అతడు ప్రతాపరెడ్డి, ఇరులై పడియున్న తెలుగువారి గుండె తెరల దుల్పి వెల్గులను నిల్పిన మిత్రుడు, మూర్చపోయినట్టి తెలుగుజాతి సంస్కృతికి టీకలు దీసిన మల్లినాథుడు.
- ఉరుము నిజాం గద్దెపయి నుల్కిపడంగను, వ్రాత వ్రాయు మా సురవర వంశ సంభవుడు.
మూలాలు[మార్చు]
- ↑ దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం(యశోరాశి),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-36
- ↑ తెలుగు సాహితీవేత్తల చరిత్ర, మువ్వల సుబ్బరామయ్య, 2012 పేజీ 144
- ↑ దాశరథి కృష్ణమాచార్య:పునర్నవం(యశోరాశి),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1961,పుట-32
- ↑ సినారె:దివ్వెల మువ్వలు(అక్షరాంజలి),కొండా శంకరయ్య ప్రచురణలు,సికింద్రాబాద్,1962,పుట-06
- ↑ మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వం,(పాలమూరు మహామండల ప్రశస్తి-గంగాపురం హనుమచ్చర్మ), సంపాదకులు:బి.ఎన్.శాస్త్రి, మూసీ ప్రచురణలు,హైదరాబాద్,1993,పుట-1