స్వామీ వివేకానంద

Wikiquote నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
స్వామీ వివేకానంద

స్వామీ వివేకానంద ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. ఇతను 1863 జనవరి 12న జన్మించాడు. ఇతని పూర్వనామం నరేంద్రుడు. 1902 జూలై 4న మరణించాడు.

స్వామి వివేకానందుని ముఖ్యమైన ప్రవచనాలు[మార్చు]

 • ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.
 • ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
 • కళింకిత హృదయులకు ఉధ్యాత్మిక వికాసం ఉండదు.
 • తెలివైన వారి తమ పని తామే సాధించుకోవాలి.
 • దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.
 • దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ అపకారం చేయలేరు.
 • పదిమంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను.
 • పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.
 • ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది.
 • ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.
 • మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.
 • మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం.
 • విశ్వాసమే బలము, బలహీనతయే మరణము.
 • వేదకాలానికి తరలిపోండి.
 • సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.
 • సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు.


w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.