అమ్మ

Wikiquote నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అమ్మ

సృష్టికి మూలం అమ్మ . అమ్మలేనిదే జీవితం లేదు.

అమ్మ పై వ్యాఖ్యలు[మార్చు]

 • బతుకు చెట్టుకు తల్లివేరు అమ్మ.

సినిమా పాటల్లో అమ్మ[మార్చు]

 • అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే --ఆత్రేయ
 • పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా --చంద్రబోస్‌
 • అమ్మను మించి దైవమున్నదా... ఆత్మను మించి అర్థమున్నదా... --సినారె
 • అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే... అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే...
 • ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --సిరివెన్నెల

కవితల్లో అమ్మ[మార్చు]

 • తల్లి యొకతే సాకు తనయు లంబదిమంది-ఉంగలోన ప్రేమ రంగరించి/ తల్లి యొకతే బరువు తనయులెందరికైన...--నార్ల వెంకటేశ్వరరావు
 • పోగులుగా విడిపోతున్న స్మృతి ముద్రను మనసు చట్రంలో పొదుగుకొని/ అమ్మ రూపం నిలుపుకుంటాను/ జన్మమూలం పదిల పరుచుకుంటాను.--సి.నారాయణరెడ్డి

అమ్మపై ఉన్న సామెతలు[మార్చు]

 • అడగందే అమ్మ అయినా పెట్టదు
 • అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
 • కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
 • ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
 • తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది.
 • తల్లి పుట్టిల్లు మేనమామ కెరుకే
 • కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
 • అమ్మ కడుపు చూస్తుంది.... ఆలి జేబు చూస్తుంది.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"http://te.wikiquote.org/w/index.php?title=అమ్మ&oldid=13308" నుండి వెలికితీశారు