అరిస్టాటిల్
స్వరూపం
అరిస్టాటిల్ క్రీ.పూ.3న శతాబ్దికి చెందిన ప్రముఖ గ్రీకు తత్వవేత్త. ప్రముఖ గ్రీకు తత్వవేత్త ప్లేటో శిష్యుడు మరియు అలెగ్జాండర్ గురువు.
అరిస్టాటిల్ యొక్క ముఖ్య ప్రవచనాలు
[మార్చు]- తత్త్వశాస్త్రమంటే సత్యపరిశీలనా శాస్త్రం.
- ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి.
- విజ్ఞులు అభిమానం కొద్దీ వినయంగా వ్యవహరిస్తారు. దుర్బుద్ధిగలవారు భయంతో వినయంగా నటిస్తారు.
- చట్టం ఆజ్ఞలాంటిది మంచి చట్టం మంచి ఆజ్ఞలాంటిది.
- నమ్మకం నీ స్వప్నాలను చిగురింపజేస్తుంది.
- భూమి మీద భయం ఉన్నంతవరకు ఆకాశంలో దేవుడుంటాడు.
- మనిషి మంచితనం ఎక్కడ అంతమౌతుందో అక్కడ రాజకీయం మొదలౌతుంది.
- మానవుడు పుట్టుకతోనే సాంఘిక జంతువు.
- వ్యాధిని వైద్యుడు తగ్గిస్తాడు, ప్రకృతి మామూలుగానే నయం చేస్తుంది.
- సన్మానం పొందడంలో గొప్పదనం లేదు. దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పదనం వుంది.
- అర్థం చేసుకున్నది వివరించాలి. తెలుసుకున్నది చేయాలి.
- మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురి అవుతూ ఉంటారు.
- విప్లవాలు,నేరాలనేవి పేదరికం నుంచే పుట్టుకొచ్చాయి. మానవుడు సంఘజీవి.
- ఆశ అనేది నడుస్తున్న కల వంటిది.
- స్నేహమనేది రెండు దేహాలలో ఉండే ఒక ఆత్మ.
- అన్ని రకాల అల్లర్లకు, అపరాధాలకు మూలకారణం దారిద్ర్యమే.
- కోపం రావడం మానవ సహజం, ఐతే దాన్ని ఎప్పుడు,ఎక్కడ,ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత.
- ఒక దేశంలో అనేక స్వభావాలు గల ప్రజలు నివసిస్తున్నారు. వీరినందరిని ఒకటిగా చేర్చేందుకు విద్యావిధానం అనేదే అవసరమైన సాధనం. దీనిని వదిలి చట్టం మూలంగానో, సంస్క్రతి,సంప్రదాయాల మూలంగానో ఒక్కటిగా చేర్చడం తెలివి తక్కువతనం.
- నేర్చుకన్నవాడికి, నేర్చుకోలేని వాడికి మధ్య ప్రాణమున్న వాటికి, ప్రాణం లేనివాటికి మధ్య గల తేడా గలదు.
- సమాజంలో మంచివాడిగా మారిన మానవుడు అన్ని ప్రాణుల కంటే గొప్పవాడు, అతడే చట్టాన్ని, నీతిని వదిలి పెట్టి జీవిస్తే అతని కంటే భయంకరమైంది ఏది లేదు.
- ఒక నగరం మంచి చట్టాలతో పరిపాలించబడే కంటే , ఒక మంచి వ్యక్తిచే పరిపాలింపబడుట గొప్పదగును.
- అందం దేవుడిచ్చిన వరం.
- ఆశ ఓ పగటి కల.
- ఆశ మేలుకొంటున్న స్వప్నం.
- సన్మానం పొందడంలో గొప్పదనం లేదు. దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది.
- మానవుడు ఆలోచించే జంతువు.
- ప్రజల భాషలో మాట్లాడాలి. మేధావులలా ఆలోచించాలి.
- కళ అంటే వస్తువు రూపం కాదు. ఆ రూపం అంతర్గత స్వభావం.
- సరైన సమయంలో సరైన కారణంతో సరైన విధానంలో కోప్పడటం సులభం కాదు.
- నీ గొప్పతనం నువ్వు పొందిన బిరుదుల్లో లేదు. దానికి నీకున్న అర్హతలో వుంది.
- మనిషి ప్రకృతి సిద్ధంగా రాజకీయ మృగం.
- పని ముగించడమంటే తీరిక మొదలు కావడమే.
- ప్రజలు నగరాలకు ప్రేమగా వస్తారు. వాళ్ళు మంచి జీవనం కోసం కలిసే వుంటారు.
- నేను ప్రజలను అనుసరిస్తాను, నేను వారికి నాయకుణ్ణి కాను.
- జీవిత సగాభాగంలో బద్ధకస్తులకు,బలమైన వారికి పెద్దగా తేడా లేదు. ఎందుకంటే నిద్రావస్థలో తేడాలేదు కనుక.
- సాధువు మెదడులోనైనా ఏదో ఒక మూల మూర్ఖ లక్షణాలుంటాయి.
- ఎంతో కొంత పిచ్చిలేని పరిశుద్ధాత్మ లేదు.
- విప్లవానికి,మోసానికి పేదరికమే మాతృక.
- ఎంతో కొంత పిచ్చిలేని ప్రజ్ఞావంతుడు వుండడు.
- అన్నింటిలోను మనం సమానులమే అనే భావనలను కల్గించడమే ప్రజాస్వామ్యం.
- పాపాన్ని పాపంతోనే ఎదుర్కోవడం మనిషి తన హక్కు అనుకుంటాడు. అలా చేయకుంటే స్వేచ్ఛ పోగొట్టుకున్నానా అని భావిస్తాడు.