కుక్క

Wikiquote నుండి

కుక్క (Dog) మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. ఇది ఒక క్షీరదం. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషి తో కలిసి జీవించడం నేర్చుకుంది.

[మార్చు] కుక్కపై ఉన్న వ్యాఖ్యలు

[మార్చు] కుక్క పై ఉన్న సామెతలు:

  • అరిచే కుక్క కరవదు
  • కుక్క కాటుకి చెప్పుదెబ్బ.
  • కుక్క తోక వంకర
  • కుక్కలు చింపిన విస్తరి లాగా
  • కుక్కలుండే ఊరికి నక్కే పోతురాజు.
  • తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు.
  • పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది.
  • మొరిగే కుక్క కరవదు కరిచే కుక్క మొరగదు.
  • శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట.
  • కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
  • కుక్క తోక పట్టి గోదారి ఈదినట్టు
  • కనకపు సింహాసనమున శునకమును కూర్చోండపెట్టినట్లు
  • చంద్రుని చూసి కుక్కలు మొరిగినట్లు
  • నల్లటి కుక్కకు నాలుగు చెవులు
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"http://te.wikiquote.org/w/index.php?title=కుక్క&oldid=9957" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె
ఇతర భాషలలొ